టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో స్టార్ డం ఉన్నా స్టార్ హీరోల్లో ఒకరు నందమూరి బాలకృష్ణ. ఆయన అంటే చాలా పెద్ద హీరో అని ప్రస్తుతం చాలా బిజీ గా ఉంటున్న హీరో అని కూడా చెప్పాలి ఎందుకంటే ఇటు సినిమా లు, అటు షోలు చేస్తూ ఇంకో పక్క హిందూపురం ఎం ఎల్ ఏ గా కూడా తన పదవి బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.అందుకే బాలయ్య బాబు చాలా బిజీ గా ఉంటున్నారు అని చెప్పవచ్చు.రీసెంట్ గానే వీర సింహ రెడ్డి సినిమా తో హిట్ కొట్టి ఈ సంక్రాంతి విన్నర్ గా నిలిచాడు.

ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే ఈ సినిమా కూడా ఈ సంవత్సరం దసరాకి రిలీజ్ చేసే పని లో ఉన్నట్టు తెలుస్తుంది...ఇక ఇది ఇలా ఉంటె ఒకప్పుడు బాలయ్య చేయాల్సిన చాలా సినిమాలు వేరే హీరో లు చేసి వాళ్ళు మంచి హిట్స్ అందుకున్నారు అలా బాలయ్య మిస్ చేసుకున్న ఒక సినిమా ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం

వెంకటేష్ హీరోగా అంజలి జవేరి హీరోయిన్ గా వచ్చిన ప్రేమించుకుందాం రా  అనే సినిమా ఒక మంచి లవ్ స్టోరీ గా వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది.అయితే ఈ సినిమా డైరెక్టర్ అయినా జయంత్ సి పరాన్జీ మొదటగా ఈ సినిమాని బాలయ్య బాబు తో చేయాలి అనుకున్నాడట కానీ అది అనుకోకుండా వెంకటేష్ దగ్గరికి వచ్చింది.అలా వెంకటేష్ తో సినిమా చేసి మంచి విజయం అందుకున్నాడు డైరెక్టర్ బాలయ్య బాబు కి ఈ సినిమా పడి ఉంటె ఒక మంచి హిట్ సినిమా గా నిలిచేది అని చాలా మంది అప్పట్లో వాళ్ల అభిప్రాయాల్ని వ్యక్తం చేసారు మరి కొందరు మాత్రం బాలయ్య కి ఇలాంటి లవ్ స్టోరీస్ సెట్ అవ్వవు ఆయన కి మాస్ సినిమాలే బాగుంటాయి అని అన్నారు. మొత్తానికి ఈ సినిమా బాలయ్య మిస్ చేసుకున్నారు అనే చెప్పాలి.

ఒక్కోసారి ఒకళ్ళు చేయాల్సిన మూవీ ఇంకోళ్లు చేయాల్సి వచిద్ది అలా జరిగినపుడు ఒక్కోసారి సినిమా హిట్ ఐతే నేను చేయాలిసుంది అని బాధ పడడం సహజం. ఒకవేళ మూవీ ప్లాప్ ఐతే హమ్మయ్య తప్పించుకున్నాను అనుకోవడం కూడా సహజమేఅని నేటిజన్స్ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: