
ఐతే ఈ నెల శనివారం ముంబయి లో జరిగిన నీతా ముఖేష్ అంబానీ సాంస్కృతిక కేంద్రం ప్రారంభోత్సవ వేడుకలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. జాన్వీకపూర్ తండ్రి బోనీ కపూర్ శిఖర్ పహారియాతో కలిసి ఈ వేడుకకు హాజరుకావడం హాట్‌టాపిక్‌గా మారింది. అంతేకాకుండా వీరిద్దరు కలిసి కొంతసేపు ప్రైవేట్‌గా సంభాషించుకున్నారు. దీంతో జాన్వీకపూర్ ప్రేమాయణానికి ఇరు కుటుంబాల నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించిందని, అందుకే బోనీకపూర్‌తో శిఖర్ పహారియా చనువుగా ఉన్నారని అంటున్నారు. ఐతే వారిరువూరు యే విషయం పై చర్చించారు అన్నది మాత్రం ఇంకా బయటకి రాలేదు కానీ ఈ జంట గురించి మాట్లాడుకొని ఉంటారు అన్న న్యూస్ మాత్రం ఇపుడు తెగ వైరల్ అవుతుంది. అదే కనుక నిజం ఐతే మాత్రం నేటిజన్ల నోటి కి ఇంకా తాళం పడ్డట్టే అని కొంత మంది అంటున్నారు.
ఐతే ప్రస్తుతం జాన్వీకపూర్ మాత్రం ఇవేమి పట్టించుకోకుండా తెలుగు లో ఎన్టీఆర్ సరసన 30 చిత్రంలో కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ మూవీ భారీ స్థాయి లో చిత్రికరించేదుకు కొరటాల మాత్రం తెగ ట్రై చేస్తూన్నారు అని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి.అసలే కొరటాల గారి ఇంతకు ముందు తీసిన ఆచార్య మూవీ డిసస్టర్ గా నిలవడమే దీనికి కారణం.