నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న దర్శకులలో ఒకరు అయినటు వంటి అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి ఇప్పటి వరకు ఈ మూవీ మేకర్స్ టైటిల్ ను ఫిక్స్ చేయకపోవడంతో ఈ సినిమా బాలకృష్ణ కెరియర్ లో 108 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యంలో ఈ సినిమా యొక్క చిత్రీకరణను ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఎన్ బి కె 108 అనే వర్కింగ్ టైటిల్ తో పూర్తి చేస్తూ వస్తుంది.

మూవీ లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. శ్రీ లీల ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి బాలకృష్ణ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ చిత్ర బృందం విడుదల చేయగా దానికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ లోని ఇంట్రవెల్ సన్నివేశానికి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ లోని ఇంట్రవెల్ సన్నివేశం జైల్లో ఉండబోతున్నట్లు ... అందులో వచ్చే యాక్షన్స్ సన్నివేశంతో ఇంటర్వెల్ కానున్నట్లు ... ఈ సన్నివేశం ముందు వరకు బాలకృష్ణ చాలా సరదాగా ఉండనున్నట్లు ... ఈ సన్నివేశం తోనే బాలయ్య లో ఉన్న పవర్ఫుల్ మ్యాన్ బయటికి రానున్నట్లు తెలుస్తోంది. ఈ ఇంటర్వెల్స్ సన్నివేశం సినిమాలో హైలెట్ గా నిలవనున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: