చియాన్ విక్రమ్ , కార్తీ , జయం రవి , ఐశ్వర్య రాయ్ , త్రిష , శోభిత ధూళిపాల ప్రధాన పాత్రలలో రూపొందిన  పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 మూవీ మూవీ పోయిన సంవత్సరం విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహించగా ... ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. పోయిన సంవత్సరం తమిళ్ తో పాటు తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయిన ఈ సినిమా తమిళ బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను రాబట్టినప్పటికి మిగతా భాషల్లో మాత్రం ఆ రేంజ్ కలెక్షన్ లను రాబట్ట లేక పోయింది. 

ఇది ఇలా ఉంటే మొత్తం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ యొక్క రెండవ భాగం ఈ నెల 28 వ తేదీన భారీ ఎత్తున తమిళ్ , తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల కానుంది. దానితో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ అదిరిపోయే రేంజ్ లో ప్రమోషన్ లను నిర్వహిస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ బృందం హైదరాబాద్ లో భారీ ఎత్తున ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా నిర్వహించింది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన బుకింగ్ లో ఓపెన్ అయ్యాయి. ఈ విషయాన్ని తాజాగా ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ బుకింగ్ లకు కూడా అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ ఇండియా వ్యాప్తంగా కనిపించే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై ముఖ్యంగా తమిళ సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: