మాస్ మహారాజ రవితేజ తాజాగా రావణాసుర అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వం వహించగా ... టాలీవుడ్ యువ నటుడు సుశాంత్మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ లో రవితేజ సరసన దాక్షా నాగర్కర్ , పూజిత పాన్నొడ , అను ఇమాన్యుయల్ , మేఘ ఆకాష్ , ఫరియ అబ్దుల్లా హీరోయిన్ లుగా నటించారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది.

మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్ లు దక్కలేదు. ఓవరాల్ గా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయంగా మిగిలి పోయింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయిన ఈ సినిమా తాజాగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను ప్రముఖ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఒకటి అయినటువంటి అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దర్శించుకుంది. అందులో భాగంగా ఈ మూవీ ని ఈ రోజు నుండి అనగా ఏప్రిల్ 28 వ తేదీ నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ తమ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో తెలుగు మరియు తమిళ భాషల్లో స్ట్రీమింగ్ చేస్తుంది. మరి ఈ మూవీ కి "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఏ రేంజ్ రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: