టాలీవుడ్ ఇండస్ట్రీ లో తన నటన తో ఎంతో మంది ప్రేక్షకుల మనసులను దోచుకున్న అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నరేష్ ఇప్పటి వరకు తన కెరియర్ లో ఎన్నో కామెడీ ప్రాధాన్యత ఉన్న సినిమా లలో నటించి ప్రేక్షకులను అద్భుతంగా అలరించడం మాత్రమే కాకుండా ఎన్నో వైవిధ్యమైన మూవీ లలో నటించి తన నటన తో కూడా ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో అలరించాడు.

ఇది ఇలా ఉంటే నరేష్ తన నటనతో ప్రేక్షకులను అలరించడానికి ఎంతో కష్టపడుతూ ఉంటాడు. ఈ విషయం ఇది వరకు ఎన్నో సార్లు ప్రూవ్ చేసుకున్నాడు కూడా.  ఇది ఇలా ఉంటే తాజాగా నరేష్ "ఉగ్రం" అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ.లో నరేష్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ కి విజయ్ కనకమెడల దర్శకత్వం వహించగా ... షైన్ స్క్రీన్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మించారు. ఈ సినిమాను మే 5 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ బృందం ఈ సినిమా ప్రమోషన్ లను ఫుల్ జోష్ లో నిర్వహిస్తోంది. ఈ మూవీ ప్రమోషన్ లలో భాగంగా ఇప్పటికే ఈ సినిమా నుండి ఈ చిత్ర బృందం అనేక ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ.లో ఒక సన్నివేశం కోసం అల్లరి నరేష్ ఏకంగా  4 రోజుల్లో 500 సిగరెట్లు తాగినట్లు తెలుస్తోంది. ఇలా ఉగ్రం మూవీ లోని కేవలం ఒకే ఒక సన్నివేశం కోసం 4 రోజుల్లో 500 సిగరెట్లు తాగి క్యారెక్టర్ డిమాండ్ చేస్తే నేను ఏమి చేయడానికైనా రెడీ అని నరేష్ నిరూపించుకున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: