గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన పొన్నియన్ సెల్వన్ మూవీ మొదటి భాగం పోయిన సంవత్సరం తమిళ్ , తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషల్లో విడుదల అయ్యి మంచి విజయం అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో విక్రమ్ , జయం రవి , కార్తీ , ఐశ్వర్య రాయ్ , త్రిష , ఐశ్వర్య లక్ష్మి , శోభితా ధూళిపాళ కీలక పాత్రలలో నటించగా ... ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించాడు.

మొత్తంగా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ యొక్క రెండవ భాగం తాజాగా ఏప్రిల్ 28 వ తేదీన తమిళ్ , తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ప్రస్తుతం ఈ మూవీ విజయ వంతంగా థియేటర్ లలో ప్రదర్శించ బడుతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన సాటిలైట్ మరియు డిజిటల్ హక్కులను భారీ ధరకు అమ్మి వేసినట్లు తెలుస్తుంది.

మూవీ యొక్క శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ సంస్థలలో ఒకటి అయినటు వంటి జెమినీ టీవీ సంస్థ భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ లలో ఒకటి అయినటువంటి అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ యొక్క థియేటర్ రన్ కొన్ని వారాలు ముగిసిన తర్వాత ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ... ఆ తర్వాత కొన్ని వారాలకు జెమినీ సంస్థ తమ ఛానల్ లో ఈ మూవీ ని ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: