‘పొన్నియన్ సెల్వన్’ పార్ట్ 2 పార్ట్ వన్ కంటే ఎక్కువ విజయాన్ని ప్రశంసలను సొంతం చేసుకుంది. ఈసినిమాకు ఓవర్సీస్ ప్రేక్షకుల ఆదరణ కూడ దక్కింది. అయితే ఈసినిమాను కేవలం చరిత్ర అంటే ఆశక్తికనపరిచే వారు మాత్రమే చూస్తున్నారని అయినప్పటికీ తమిళ ప్రజలకు తమ చరిత్ర పట్ల ఉండే ఆశక్తి అభిమానం వల్ల ఈసినిమాకు మంచి కలక్షన్స్ వస్తున్నాయని మరొక వాదన కూడ ఉంది.


ఈసినిమాకు తెలుగు ప్రేక్షకుల నుండి కూడ ఆదరణ లభిస్తోంది. దీనితో చాలామంది అనుకున్నట్లుగా మణిరత్నం హవా కొనసాగుతోంది అన్న స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి. పాన్ ఇండియా మూవీగా విడుదలైన ఈసినిమాలోని వల్లవారియాన్ వంద్యదేవన్ పాత్రకు మొదట్లో మణిరత్నం దృష్టిలో రామ్ చరణ్ ఉన్నాడట. దీనితో స్వయంగా మణిరత్నం చిరంజీవి ఇంటికి వచ్చి కార్తి నటించిన వల్లవారియాన్ పాత్రను రామ్ చరణ్ ను చేయమని అడిగాడట.


అయితే మణిరత్నం అభ్యర్థనను చరణ్ సున్నితంగా తిరస్కరించాడు అన్న వార్తలు ఉన్నాయి. వాస్తవానికి కార్తి ఈసినిమాలో కనపరిచిన నటనలో ఈజ్ అదేవిధంగా బాడీ లాంగ్వేజ్ చరణ్ ప్రదర్శించడం కష్టం అన్న అభిప్రాయంతో ఈమూవీ మేకర్స్ ఉండటంతో చరణ్ ను కార్తీ పాత్రలో నటించమని మణిరత్నం పెద్దగా ప్రయత్నించలేదు అన్న వార్తలు కూడ ఉన్నాయి. ఈమూవీ లో  కార్తి ఎంటర్ టైనింగ్ గా రొమాంటిక్ గా కన్పించడంతో తమిళ ప్రేక్షకులు ఈసినిమాను బాగా చూస్తున్నారు అన్న వార్తలు కూడ వస్తున్నాయి.


వాస్తవానికి కార్తి నటించిన పాత్రలో చరణ్ చేసి ఉంటే కోలీవుడ్ ప్రేక్షకులలో ఈమూవీ విజయం ద్వారా మంచి గుర్తిపింపు తెచ్చుకునే వాడు అన్న అభిప్రాయాలను కొందరు విశ్లేషకులు వ్యక్త పరుస్తున్నారు.  తమిళ  ప్రజలకు ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ కంటే ‘పొన్నియన్ సెల్వన్’ పార్ట్ 2 బాగా నచ్చింది. తమిళ చరిత్ర అన్నా అక్కడి సంస్కృతి అన్నా పెద్దగా చదువుకోని సగటు తమిళుడు కు కూడ బాగా ఇష్టం అన్న విషయాన్ని ‘పొన్నియన్ సెల్వన్’ మరొకసారి రుజువు చేసింది..





మరింత సమాచారం తెలుసుకోండి: