తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న యువ హీరోలలో ఒకరు అయినటు వంటి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అల్లుడు శీను మూవీ తో వెండి తెరకు పరిచయం అయిన ఈ యువ హీరో ఆ తర్వాత పలు మూవీ లలో హీరో గా నటించి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నటుడి గా తనకంటూ ఒక గొప్ప గుర్తింపును ఏర్పరచుకున్నాడు.

ఇది ఇలా ఉంటే ఎన్ని సంవత్సరాల పాటు తెలుగు సినిమాల్లో నటించిన ఈ యువ హీరో ప్రస్తుతం తెలుగు లో సూపర్ హిట్ విజయం సాధించినటువంటి చత్రపతి మూవీ ని హిందీ లో రీమేక్ చేశాడు. ఈ రీమేక్ మూవీ కి వినాయక్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను మే 12 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి టీజర్ ... ట్రైలర్ లను కూడా విడుదల చేసింది.

వీటికి ప్రేక్షకుల నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ చిత్ర బృందం ఈ మూవీ ప్రమోషన్ లను నిర్వహిస్తుంది. అందులో భాగంగా తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు. తాజాగా మీడియాతో సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ ... నేను ముంబై లోని ... అందేరిలోని భారీ జాన్ యాక్టింగ్ స్కూల్లో యాక్టింగ్ కోర్స్ చేస్తున్నప్పుడు వారు నాకు నాగార్జున సార్ నటించినటు వంటి శివ మూవీ ని రిఫరెన్స్ పిక్చర్ గా చూపించారు అంటూ సాయి శ్రీనివాస్ తాజాగా చెప్పుకొచ్చాడు. మరి చత్రపతి మూవీ తో సాయి శ్రీనివాస్ బాలీవుడ్ ప్రేక్షకులను మేరకు అలరిస్తాడో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: