సాయి ధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ తరువాత టాలీవుడ్ లో ఒక్క సరైన హిట్ పడలేదు. ప్రతి శుక్రువారం విడుదల అవుతున్న మీడియం రేంజ్ హీరోల సినిమాలు అన్నీ వరస ఫ్లాప్ లుగా మారుతూ ఉండటంతో ధియేటర్లు అన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. దీనితో ఈసారి సమ్మర్ సీజన్ పూర్తిగా ఫెయిల్ అయిందా అన్నసందేహాలు వస్తున్నాయి. 


ఇలాంటి పరిస్థితులలో ఈవారం విడుదల అవుతున్న ఒక డబ్బింగ్ సినిమా పై ఏర్పడిన మ్యానియా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. 8 సంవత్సరాల క్రితం విడుదలైన ‘బిచ్చగాడు’ మూవీ ఎవరూ ఊహించని విజయాన్ని అందుకుంది. ఆమూవీ తరువాత విజయ్ ఆంటోని నటించిన ఎన్నో సినిమాలు విడుదల అయినప్పటికీ ఆసినిమాలు ఏమాత్రం విజయాన్ని అందుకోలేకపోయాయి. 


దీనితో అతడి మార్కెట్ పూర్తిగా పడిపోయింది. దీనితో ఎలాగైనా హిట్ కొట్టాలి అన్న పట్టుదలతో ఈ హీరో నటించిన ‘బిచ్చగాడు 2’ ఈవారం విడుదలకాబోతోంది. నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన ‘అన్నీ మంచి శకునములే’ మూవీతో పోటీగా విడుదలకాబోతున్న ఈమూవీ హిట్ అయ్యే ఆస్కారం ఎక్కువగా ఉంది అన్న అంచనాలు ఉన్నాయి. ఈఅంచనాలకు అనుగుణంగా తెలుగురాష్ట్రాలలో ఈమూవీ బిజినెస్ 8 కోట్ల స్థాయిలో జరగడం అందర్నీ ఆశ్చర్య పరచడమే కాకుండా ఈమూవీకి అంతా రేంజ్ ఉందా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. 


ఈస్థాయిలో బిజినెస్ జరుపుకున్న ఈమూవీ బయ్యర్లు లాభపడాలి అంటే కనీసం ఈమూవీకి తెలుగు రాష్ట్రాలలో 12 కోట్లకు పైగా కాలక్షన్స్ వచ్చి తీరాలి. ఇంత కలక్షన్స్ వచ్చే రేంజ్ ఈసినిమాకు ఉందా అంటూ ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి. దీనికితోడు ఈమూవీకి పోటీగా విడుదల అవుతున్న ‘అన్నీ మంచి శకునములే’ పూర్తి ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీ కావడంతో ‘బిచ్చగాడు 2’ ఎంతవరకు సక్సస్ అందుకుంటుంది అన్న మాటలు కూడ వినిపిస్తున్నాయి. ఈమధ్య కాలంలో చాల సినిమాలు ఊహించని విజయాన్ని అందుకుంటున్నాయి. ఇప్పుడు ఆ లిస్టులో ‘బిచ్చగాడు 2’ ఉంటుందా లేదా అన్నది సస్పెన్స్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: