నాచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన ఆఖరి 5 మూవీ లు ఎన్ని కోట్ల కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేశాయో తెలుసుకుందాం.

నాచురల్ స్టార్ నాని తాజాగా దసరా అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటించాడు. ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషల్లో విడుదల అయింది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. ఈ సినిమా 63.55 కోట్ల షేర్ కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసింది. ఈ సినిమా నాని కెరియర్ లో ఇప్పటి వరకు ఏ సినిమా కూడా వసూలు చేయని కలెక్షన్ లను వసూలు చేసి నాని కెరియర్ లో హైయెస్ట్ కలెక్షన్ లను వసూలు చేసిన మూవీ గా నిలిచింది.

నాని హీరోగా నజ్రియా హీరోయిన్ గా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన అంటే సుందరానికి మూవీ 21.35 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.

నాని హీరోగా సాయి పల్లవి ... కృతి శెట్టి హీరోయిన్ గా రాహుల్ సంకృతీయన్ దర్శకత్వంలో రూపొందిన శ్యామ్ సింగరాయ్ మూవీ ఫైనల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 26.50 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది.

నాచురల్ స్టార్ నాని హీరోగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో రూపొందినటువంటి గ్యాంగ్ లీడర్ మూవీ ఫైనల్ రన్ ముగిసే సరికి 23.40 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.

నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన జెర్సీ మూవీ ఫైనల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 32.03 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది.

నాని హీరో గా నటించిన ఆఖరి 5 మూవీ లు కలిసి ఓవరాల్ గా 166.83 కోట్ల షేర్ కలక్షన్ లను చేశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: