యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌ గత సంవత్సరం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటించి ప్యాన్ ఇండియా రేంజ్‌లో సూపర్ క్రేజ్ ని సంపాదించుకున్నాడు.2022 మార్చి 25 వ తేదీన విడుదలై వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది.ఇంకా అంతేకాదు ఆస్కార్ రేసులో హాలీవుడ్ సినిమాలతో పోటీ పడి ఆస్కార్‌ను గెలిచింది. నాటు నాటు సాంగ్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అవార్డ్‌ను దక్కించుకుంది.ప్రస్తుతం ఈయన కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అయితే శరవేగంగా జరుగుతోంది. రేపు (శని వారం మే 20)న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఎన్టీఆర్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్‌తో కూడిన పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.ఈ సినిమాకు అందరు అనుకున్నట్టే 'దేవర' అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేశారు. ఇందులో ఎన్టీఆర్ మరోసారి తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నట్టు ఈ పోస్టర్ చూస్తే ఇట్టే తెలుస్తోంది. చేతిలో ఆయుధంతో ఎన్టీఆర్ లుక్ అయితే చాలా ఫెర్రోషియస్‌గా ఉంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రతి నాయకుడిగా పాత్రలో నటిస్తున్నాడు. 


తాజాగా  హాలీవుడ్ రేంజ్‌లో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశారు. ఈ సినిమాలో సైఫ్‌ అలీ ఖాన్ కు జోడిగా తెలుగు సీరియల్ నటి అష్టా చమ్మా ఫేమ్ నటి చైత్ర రాయ్ నటించనుందని తెలుస్తోంది. షూటింగ్ కాస్తా లేటైనా ఎట్టి పరిస్థితుల్లో కూడా ముందుగా టీమ్ ప్రకటించిన డేట్‌కే ఈ సినిమాను విడుదల చేయడానికి ట్రై చేస్తున్నట్లు  టాక్ వినిపిస్తోంది.ఈ సినిమాని ఏప్రిల్ 5, 2024 న థియేటర్స్ లోకి తీసుకువచ్చేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది.అనిరుధ్ రవి చందర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమా ఐలాండ్ & పోర్ట్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండనుందని సమాచారం తెలుస్తోంది. ఇక ఈ సినిమా షూట్‌ను ముఖ్యంగా హైదరాబాద్‌, వైజాగ్‌ ఇంకా గోవాలో వేసిన సెట్స్‌లో జరుపునున్నారట. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ ఈ సెట్స్ ని డిజైన్ చేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ ప్యాన్ ఇండియా కథతో సినిమా చేయాలనుకుంటున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే అందుకు ముందు అనుకున్న కథను పక్కకు పెట్టి.. పూర్తిగా కొత్త కథతో ముందుకుపోతున్నట్టు సమాచారం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: