శతమానం భవతి సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్న హీరో శర్వానంద్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఆయన సుధీర్ వర్మ తీస్తున్న సార్వార్ 27 లో చేస్తున్నాడు. ఇటీవల ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా పోస్టర్ విడుదల చేశారు.  ఇక విజయవాడలోని అమ్మవారి ఇంట 1984 మార్చి 6న జన్మించిన శర్వానంద్ కి ఒక అన్నయ్య అక్క ఉన్నారు. ఆయన తండ్రి ప్రసాద్ రావు ఒక వ్యాపారవేత్త బేగంపేట్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివిన శర్వానంద్ కి చిన్నప్పటినుండి సినిమాల పైన విపరీతమైన పిచ్చి ఉండేది. అప్పట్లో రామ్ చరణ్ రానా క్లాస్మేట్ గా ఉండేవాళ్ళు అప్పుడు వారందరి మధ్య సినిమాల ప్రస్తావన కూడా వచ్చేది కాదు .కానీ ఇంటర్ బోర్డ్ అయిన తర్వాత సినిమాల్లోకి వెళ్ళాలి అన్న అతని కోరికను గౌరవించి అతడి పేరెంట్ శర్వానంద్ ని ప్రోత్సహించారు. 

డిగ్రీ కూడా లేకుండా ఎలా ఉంటావు అని డిగ్రీ అయిపోయిన తర్వాత సినిమాల్లోకి వెళ్ళమని తన తల్లి పెట్టిన కండిషన్ మేరకు సికింద్రాబాద్ కాలేజీలో బీకాం పూర్తి చేశాడు. డిగ్రీ పూర్తయిన తర్వాత సమ్మర్ లో జూబ్లీహిల్స్ లో ప్రతిరోజు బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ చేసేవాడు. ఇక అక్కడినుండి వస్తున్నప్పుడు సినిమాల్లో హీరో అవ్వాలన్న కోరిక హీరో ఆర్యన్ రాకేష్ కి చెప్పడంతో ఆయన సూచన మేరకు పేరెంట్స్ కి చెప్పి ముంబైలోని కిషోర్ నమిత నట శిక్షణ లైన్ లో చేరాడు. అలా ఆరు నెలలు ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత హైదరాబాద్ వచ్చి సినీ ఛాన్స్ల కోసం విశ్వ ప్రయత్నాలు చేశాడు. అంతేకాదు రెండేళ్లకు పైగానే ఫిలింనగర్ చుట్టూ తిరిగాడు కానీ ఒక్క ఛాన్స్ కూడా రాలేదు. ఆడిషన్స్ కి వెళ్ళినా కూడా సెలెక్ట్ అయ్యేవాడు కాదు. వైజాగ్ సత్యానంద్ యాక్టింగ్ స్కూల్లో శిక్షణ తీసుకుంటే ఫలితం ఉంటుందని ఎవరో చెప్పడంతో అక్కడికి కూడా వెళ్ళాడు శర్వానంద్. సత్యానంద యాక్టింగ్ స్కూల్లో చేరిన నేపథ్యంలో ఓ నిర్మాత దర్శకుడు కొత్త నటుల కోసం వెతుకుతూ నా స్కూల్ కి రావడం జరిగింది. 

ఆ సమయంలో శర్వానంద్ సెలెక్ట్ అయ్యాడు. హీరోగా చేసిన ఆ సినిమా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా ఎవరికి తెలియదు. అనంతరం గౌరీ సినిమాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేయమని డైరెక్టర్ రమణ శర్వానంద్ కి ఛాన్స్ ఇచ్చాడు. అనంతరం యువసేన సినిమాలో నలుగురు హీరోల్లో ఒక హీరోగా అవకాశాన్ని దక్కించుకున్నాడు. అలా శంకర్ దాదా ఎంబిబిఎస్ సంక్రాంతి లక్ష్మి మూవీస్ లో అవకాశాలను దక్కించుకున్నాడు. అలా రాజు మహారాజు సినిమాలో మోహన్ బాబుతో కలిసి నటించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. అలా ఎన్నో సినిమాల్లో నటించిన శర్వానంద్ గమ్యం సినిమా చేసి అమెరికా వెళ్ళిపోయాడు. ఇక ఆ సినిమా హిట్తో ఆయన దిశ మారిపోయింది అనంతరం ప్రస్థానం సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు. తర్వాత జర్నీ తెలుగు తమిళ భాషల్లో మంచి విజయాన్ని అందుకుంది. దాని తరువాత రన్ రాజా రన్ సినిమాతో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. దాని తర్వాత మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, ఎక్స్ప్రెస్ రాజా మూవీ తో మంచి విజయాన్ని అందుకున్న శర్వానంద్ 2017లో శతమానం భవతి సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: