టాలీవుడ్లో స్టార్ హీరోలుగా ఒక వెలుగు వెలుగుతున్న వారిలో మహేష్ బాబు ,పవన్ కళ్యాణ్ అగ్ర హీరోలలో మొదటి స్థానంలో ఉంటారని చెప్పవచ్చు.. వీరిద్దరూ తమదైన స్టైల్ లో సినిమాలను తెరకెక్కిస్తే బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలు మరొకవైపు చిత్రాలను తెరకెక్కిస్తూ అభిమానులను ఫుల్ ఖుషి చేస్తున్నారు. సినిమాలకు సంబంధించి వరుస అప్డేట్లను కూడా విడుదల చేస్తూ ఉన్నారు చిత్ర బృందం పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలు ఉన్నట్టు తెలుస్తోంది.


మహేష్ బాబు సినిమాలు విషయానికి వస్తే డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ రాజమౌళితో తన తదుపరి చిత్రాన్ని తీయబోతున్నారు.. త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు.. అయితే ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ కూడా ఒక సినిమాని సంక్రాంతికి విడుదల చేసే పనిలో పడ్డట్టుగా తెలుస్తోంది. షూటింగ్ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ చాలా స్పీడ్ గా ఉంటూ త్వర త్వరగా సినిమా షూటింగ్లను పూర్తి చేసుకొని రాజకీయాల వైపు ఎక్కువగా మక్కువ చూపాలని చేస్తున్నారు.


దీంతో కమిట్ అయిన చిత్రాలను పూర్తిచేసే పనిలో పడ్డారు పవన్ కళ్యాణ్.. ఒకవేళ పవన్ కళ్యాణ్ ,మహేష్ బాబు ఇద్దరు కూడా సంక్రాంతి బరిలో దిగితే ఎలా ఉంటుంది అనే విషయంపై కొంతమంది విశ్లేషకులు తెలియజేస్తూ బాక్సాఫీస్ వద్ద ఇంతకన్నా పెద్ద పండుగ ఏమి ఉండదు. ఎవరు ఎంత చేసిన సినిమాలు ఒకసారి చూసిన బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధిస్తాయని సినీ విశ్లేషకులు సైతం తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఒక చిత్రానికి ఈ ఇద్దరు హీరోలు కొన్ని కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి అనుకున్నట్టుగానే సంక్రాంతి బరిలో ఇద్దరు హీరోలు పోటీ పడతారేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: