తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కొన్ని సంవత్సరాల క్రితం స్టార్ డైరెక్టర్ గా కెరియర్ ను కొనసాగించినటువంటి తేజ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన చిత్రం , జయం , నువ్వు నేను మూవీ లతో వరుసగా మూడు భారీ బ్లాక్ బస్టర్ విజాయలను అందుకొని అతి తక్కువ కాలం లోనే టాలీవుడ్ టాప్ దర్శకుల లిస్ట్ లో చేరిపోయాడు. కానీ ఆ తర్వాత మాత్రం ఈ దర్శకుడు అంతటి స్థాయి బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకోవడంలో అంత సక్సెస్ కాలేదు. అలా చాలా కాలం పాటు వరుస అపజాయలను ఎదుర్కొన్న ఈ దర్శకుడు నేనే రాజు నేనే మంత్రి మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు.

తాజాగా ఈ దర్శకుడు అహింస అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తనయుడు అయినటువంటి అభిరామ్ హీరో గా నటించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ లభించింది. ప్రస్తుతం ఈ మూవీ కి భారీ కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కడం లేదు. ఇది ఇలా ఉంటే తాజాగా తేజ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూ లో భాగంగా తేజ అనేక ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు.

తాజా ఇంటర్వ్యూ లో తేజ కు ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి నుండి మీ మూవీ లలో ఏ సినిమాను అయిన అభిమానుల కోసం రీ రిలీజ్ చేయాలి అని అనుకుంటే మీరు ఏ సినిమా విడుదల చేస్తారు అనే ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు తేజ సమాధానం ఇస్తూ ... ఈ మధ్య కాలంలో ఫ్యాన్స్ జయం ,  నువ్వు నేను , నిజం మూవీ లను రీ రిలీజ్ చేయమని అడుగుతున్నారు. అలాగే నేనే రాజు నేనే మంత్రి మూవీ ని కూడా మళ్లీ థియేటర్ లలో రీ రిలీజ్ చేయాలని అడుగుతున్నారు అంటూ సమాధానం ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: