ఏ రంగంలో అయినా 80 శాతం సంపద కేవలం 20శాతం మంది వ్యక్తుల దగ్గర మాత్రమే ఉంటుంది. ఇటలీ దేశానికి చెందిన ఆర్ధిక శాస్త్రవేత్త ఇలాంటి వైరుధ్యానికి ‘పెరాటో ఫార్ములా’ కారణం అని అంటున్నారు. సంపద అంతా ఈ 20 శాతం మంది దగ్గర చిక్కుకోవడానికి వారికి డబ్బు సంపాదన విషయమై వారు ఎంచుకున్న రంగాలలో ఉన్న అద్వితీయమైన ప్రతిభ మాత్రమే కారణం అని పెరాటో అంటున్నాడు.


విలువలతో కూడిన నాణ్యమైన సేవలు అందించడంతో పాటు నిరంతరం వారు చేసే అలుపెరగని కృషితో 80 శాతం సంపద ఈ 20శాతం మంది దగ్గర ఉంది అని పెరాటో ఫార్ములా అభిప్రాయపడుతోంది. ఇలాంటి పరిస్థితి ఏర్పడటానికి ఈ ఫార్ములా ఒక కారణాన్ని విశ్లేషిశిస్తోంది. ఒక వ్యక్తి పొందే డబ్బు అతడు చేసే పనికి ఉండే డిమాండ్ ఆపనిచేయడానికి అతనికి ఉండే సామర్ధ్యం ఈ రెండు విషయాలతో ముడిపడి ఉండటమే పెరాటో ఫార్ములా.


ప్రపంచ జనాభాలో డాక్టర్ల కన్నా టీచర్ల సంఖ్య చాల ఎక్కువ. దీనితో ప్రపంచ వ్యాప్తంగా టీచర్లకు వచ్చే ఆదాయం కన్నా డాక్టర్లకు వచ్చే ఆదాయం చాల ఎక్కువ. అదేవిధంగా బాగా పేరు పొందిన సినిమా నటీనటులు క్రీడాకారులు  మ్యుజిషియన్స్ చాల తక్కువమంది ఉంటారు. దీనితో ఇలా పేరున్న వారికి కోట్లాది రూపాయలలో వారికి ఉన్న డిమాండ్ రీత్యా పారితోషికాలు వస్తూ ఉంటాయి.


ఏ వ్యక్తికి అయినా తాను పనిచేస్తున్న రంగంలో తనకు వచ్చే ఆదాయంతో సంతృప్తి చెందకపోతే అతడు ముందుగా ఆలోచించుకోవలసిన విషయం ‘తాను చేసే పనిలో ఎంత విశిష్టత సమర్థత ఉంది అన్న అంశం’. ఈ విషయాలను పరిగణలోకి తీసుకోకుండా తన సమర్థకు సరైన గుర్తింపు పారితోషికం రాలేదని సంపద అంతా 80 శాతం మంది చేతిలో చిక్కుకుపోయి ఉంది అంటూ ఆవేదన పడుతూ ఉంటారు అయితే ఇది వాస్తవం కాదు. ఎవరైతే నిరంతరం తమ వృత్తిలో తమ నిపుణతను మెరుగుపరుచుకుంటూ కృషి చేస్తూ ఉంటారు వారి దగ్గరకే సంపద చేరుతుంది..   

మరింత సమాచారం తెలుసుకోండి: