ఇటీవల కాలంలో పాత నోట్ లకు  బాగా డిమాండ్ బాగా  పెరిగింది అని చెప్పవచ్చు.. మన వాళ్లు కొంతమంది గుర్తు  కోసం కూడా పాత నోట్లను , పాత కాయిన్ లను భద్రపరచుకుంటూ ఉంటారు. అలా మీరు కూడా మీ చిన్ననాటి సమయంలో చూసిన పాత కరెన్సీ నోట్లను దాచుకున్నారా..? లేదా ఎక్కడైనా దాచి మర్చిపోయారా..? అయితే వెంటనే మీరు వాటిని వెతికి బయటికి తీయండి. ఇప్పుడు చెప్పబోయే ఒక గుర్తు ఆ నోట్  పైన ఉందో.. లేదో..పరిశీలించండి. ఒకవేళ మేము చెప్పబోయే విషయాలు గనుక , ఆ నోట్ పైన ఉంటే మీరు లక్షాధికారి అవ్వచ్చు. ఇక ప్రపంచవ్యాప్తంగా పాత నోట్లను సేకరించే వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతోంది అని చెప్పవచ్చు. వీరిని న్యూమిస్ మాటిక్ అని అంటారు.

వీరికి ఉన్న అలవాటే మనకు లక్షల్లో ఆదాయాన్ని తీసుకొచ్చి పెడుతోంది. ఇక వీరు పాత కాయిన్ లను, పాత నోట్లను కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇక ఈ పాతవాటిని యాంటిక్ పీస్ లు గా పరిగణించి, వాటి విలువను అమాంతం పెంచేస్తున్నారు. ఉదాహరణకు మీ దగ్గర ఒక ఐదు రూపాయల నోటు ఉండి,  అందులోనూ ట్రాక్టర్ బొమ్మ కలిగిన నోటు ఉంటే దానిని ఒక వ్యక్తి  రూ.5 లక్షలకు కొన్నారనుకుందాం.. ఇక అతను  భవిష్యత్తులో దాన్ని వేలంపాట పెట్టి , కోట్లల్లో కూడా లాభార్జన పొందినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

అయితే ఇక అసలు విషయానికొస్తే, గత 26 సంవత్సరాల కిందట రూపాయి నోటు ముద్రించడం ఆపివేసింది కేంద్ర ప్రభుత్వం. ఇక తిరిగి 2015 సంవత్సరం నుంచి ఈ రూపాయల నోట్లను ముద్రించడం ప్రారంభించింది. అయితే స్వాతంత్రం కంటే ముందు ఉన్న రూపాయి నోటు,  గనక మీ దగ్గర ఉన్నట్లయితే,  ప్రస్తుతం దాని విలువ మార్కెట్లో ఏడు లక్షల రూపాయల వరకు ధర పలుకుతోంది. అంటే బ్రిటీష్ కాలం నాటి 1935వ సంవత్సరంలో ముద్రించబడిన ఒక రూపాయి నోటు , దానిపైన బ్రిటిష్ ప్రభుత్వం గవర్నర్ అయిన J.W.KELLY సంతకం ఉన్నట్లయితే, దాని విలువ ఏడు లక్షల రూపాయలు. ఈ నోట్ ని మీరు ebay.com వెబ్సైట్ లో పెట్టి డబ్బులు సంపాదించవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: