ప్రీమియం చెల్లించే వ్యవధి ముగిసిన తర్వాత మెచ్యూరిటీ వరకు కూడా ఈ ప్లాన్ ఇయర్లీ సర్వైవల్ బెనిఫిట్స్ ను తప్పకుండా అందిస్తుంది. ఇక మెచ్యూరిటీ తర్వాత లేదా పాలసీ వ్యవధిలో పాలసీదారుడు ఒకవేళ చనిపోతే.. ఒకేసారి మొత్తం పాలసీ అమౌంట్ కూడా లభిస్తుంది. ఇలాంటి రియల్ బెనిఫిట్స్ తో జీవన్ ఉమాంగ్ ప్లాంట్ పాలసీదారుల కుటుంబానికి ఆర్థిక భద్రతతో పాటు రక్షణ కూడా లభిస్తుంది.. ముఖ్యంగా డెత్ బెనిఫిట్ అందించే జీవన్ ఉమాంగ్ పాలసీలో మెచ్యూరిటీ అమౌంట్ పై ఎలాంటి పన్ను కూడా కట్టాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా పాలసీ హోల్డర్స్కు 100 సంవత్సరాల వయసు వచ్చేవరకు జీవితకాల రిస్క్ కవరేజ్ కూడా లభిస్తుంది .
అలాగే 30 సంవత్సరాల వరకు ఆదాయానికి హామీ కూడా లభిస్తుంది అని చెప్పవచ్చు. ఇందులో 90 రోజుల వయసున్న చిన్నారులను మొదలుకొని 55 సంవత్సరాల వయసు ఉన్నవారు వరకు పాలసీలో చేరడానికి అర్హులవుతారు. ఈ పాలసీ టర్మ్ 100 సంవత్సరాల వరకు ఉంటుంది. కనీస హామీ మొత్తం రెండు లక్షలు ఉండగా గరిష్ట హామీపై ఎలాంటి పరిమితులు ఉండవు. ఉదాహరణకు మీరు 30 సంవత్సరాల నుండి సమయంలో జీవన్ ఉమాంగ్ పాలసీల రూ.10 లక్షలకు బీమా తీసుకుంటే.. అతడి పాలసీ టర్మ్ 70 సంవత్సరాలు అవుతుంది. పేమెంట్ టర్మ్ ను p20 సంవత్సరాలుగా సెలెక్ట్ చేసుకుంటే సంవత్సరానికి రూ.54,036 లభిస్తుంది. అంటే నెలకు రూ.5000 చొప్పున కట్టినట్లయితే రూ.10 లక్షలు మీ సొంతం చేసుకోవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి