ప్రస్తుతం మార్కెట్లో బ్రాయిలర్ కోళ్ల ఫారం ఏర్పాటు చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందుకే బ్రాయిలర్ కోళ్ల ఫారం ఏర్పాటు చేయాలి అంటే పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టాలి. కాబట్టి మార్కెట్లో ఉన్న పౌల్ట్రీ సంస్థల నుంచి ఫ్రాంచైజీ కూడా పొందాల్సి ఉంటుంది కానీ మీరు సొంతంగా నాటు కోళ్ల ఫామ్ ఏర్పాటు చేస్తే ఆదాయం మీకే లభిస్తుంది. ఉదాహరణకు మీ వద్ద ఒక అర ఎకరం వ్యవసాయం భూమి ఉన్నట్లయితే ఓపెన్ పద్ధతిలోనే నాటు కోళ్ల ఫారం ప్రారంభించవచ్చు. మామిడి తోట , జామ తోట వంటి తోటలు ఉంటే అందులో అదనపు ఆదాయం వచ్చేందుకు ఈ ఫారం చక్కగా ఉపయోగపడుతుంది.
సాంప్రదాయ పద్ధతిలోనే వీటిని పెంచి మార్కెట్లో అమ్మవచ్చు. పెట్టుబడి ఖర్చు తక్కువ పైగా ఆదాయం కూడా ఎక్కువగా వస్తుంది. ముఖ్యంగా తోటలో లభించే పురుగులు ఇతర పోషకాలను కోళ్లు సేకరించి అవి బరువు పెరిగి మీకు ఖర్చును కూడా తగ్గిస్తాయి. ప్రస్తుతం ఈ కోళ్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది కాబట్టి మీరు కేవలం రూ .10, 000 పెట్టుబడి పెట్టిన సరే మీకు మంచి ఆదాయం లభిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం సొంత ఊరిలో ఉండి ఈ ఆదాయాన్ని పెంపొందించుకోవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి