మనం చేసేటువంటి పని ఏదైనా సరే మనమే యజమానిగా మారితే ఆ ఆనందం మరొక లాగా ఉంటుంది. చాలా మంది సొంతగా బిజినెస్ లు ప్రారంభించాలనుకుంటూ ఉంటారు. తమతో పాటు కొంతమంది ఉపాధి కల్పించాలని ఎన్నో కలలు కూడా కంటూ ఉంటారు. అయితే చాలామందికి ఎలాంటి వ్యాపారం ప్రారంభించాలో తెలియదు వ్యాపారంలో తక్కువ పెట్టుబడితే ఎక్కువ ఆదాయాన్నిచ్చే వ్యాపారాల వైపే మక్కువ చూపాలి.. ఇలాంటి వ్యాపారాలు నగరాలలో చాలానే ఉండవచ్చు. మరి పల్లెలలో ఈ వ్యాపారాలను ప్రారంభించాలి అంటే ఎలాంటి వ్యాపారాలను ప్రారంభిస్తే మంచిదో చూద్దాం.


1). మినీ ఆయిల్ మిల్:
చిన్న ఆయిల్ మిల్లు వ్యాపారాన్ని ప్రారంభిస్తే తక్కువ మొత్తంలో ఎక్కువ లాభాలను సైతం పొందవచ్చు. చుట్టుపక్కల గ్రామాలలో ఉండే వారంతా కూడా ఎక్కువగా ఇలాంటి మిల్లుల కోసమే వస్తూ ఉంటారు.

2). మోటార్ సైకిల్ రిపేరింగ్ సర్వీసింగ్ షాప్:
పల్లెలను నుంచి పట్టణాలకు మోటార్ సైకిల్ రిపేర్ తీసుకురావడానికి చాలా కష్టంగా ఉంటుంది. అందుకే పల్లెలలోనే మోటార్ సైకిల్ రిపేరింగ్ సర్వీసింగ్ సెంటర్ పెట్టుకుంటే చుట్టూ ఉండే గ్రామాల నుంచి మంచి ఆదాయం లభిస్తుంది.


3). ఊరగాయ వ్యాపారం:
ఈ ఊరగాయ వ్యాపారం ఎప్పుడైనా సరే మంచి గిరాకీ ఉంటుంది.. అయితే ఈ ఊరగాయను ఎక్కువగా నిల్వ ఉంచుకోవడానికి పలు రకాల పరికరాలను సైతం తీసుకోవాలి.


4). కోళ్ల పెంపకం:
పల్లెలలో నాటి కోళ్ల పెంపకం వల్ల మంచి గిరాకీ ఉంటుంది ఇది సాధారణ కోళ్ల కంటే మూడింతల రేటు ధరకే పలుకుతాయి.. అయితే ఇవి పెరగడానికి కాస్త సమయం పడుతుంది.

5). పాల వ్యాపారం:
పాల డైరీ ద్వారా పల్లెలలో కూడా భారీగా ఆదాయాన్ని సైతం పొందవచ్చు.. ఈ పాలను డైరీ ద్వారా విక్రయిస్తే మరింత లాభాన్ని సైతం పొందవచ్చు.

6). పిండి మిషన్:
పల్లెలలో ఏవైనా ఆడించుకోవాలన్న కచ్చితంగా పిండి మిషన్ అవసరము.. తక్కువ బడ్జెట్ లో కలిగిన మిషన్ రీని అమర్చుకుంటే మంచి లాభాలు వస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: