Cచాలామంది వివాహమైన లేక పిల్లలు పుట్టిన తర్వాత మహిళల సైతం ఉద్యోగం మానేసి ఇంట్లోనే పిల్లల్ని చూసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అయితే పిల్లలు కాస్త పెద్ద వాళ్ళు అయిన తర్వాత స్కూల్ కి వెళ్లడంతో వీరికి కాస్త సమయం దొరుకుతుంది ఆ సమయాన్ని ఉపయోగించుకొని చిన్న హోం బెస్ట్ బిజినెస్తున్నాను స్టార్ట్ చేస్తే మంచి లాభాలను అందుకోవచ్చు. ఇంటి నుండి కాలు బయట పెట్టకుండానే కొంతమేరకు డబ్బు సంపాదించుకోవచ్చు. అలాంటి బిజినెస్ ఐడియాలను ఇప్పుడు ఒకసారి చూద్దాం.


1). గిఫ్ట్స్:
గిఫ్ట్ ప్యాకింగ్ , సేలింగ్ వంటివి చేయడం వల్ల మంచి లాభాలను అందుకోవచ్చు. పెళ్లిరోజు బర్తడే రోజు వాలెంటైన్స్ డే ఇతరత్రా వాటికి కచ్చితంగా ఈ మధ్యకాలంలో చాలామంది గిఫ్టులను ఉపయోగిస్తూ ఉన్నారు. అలాగే ఫెస్టివల్స్కు కూడా ఎన్నో రకాల గిఫ్ట్ కూడా సేల్ అవుతూ ఉంటాయి. వీటి మీద మంచి పట్టు ఉంటే ఈ బిజినెస్ మొదలు పెట్టవచ్చు.


2). క్యాండిల్ మేకింగ్:
గతంలో ఎక్కువగా కొవ్వొత్తులను చాలామంది ఉపయోగించేవారు.. అయితే ఈ మధ్యకాలంలో పలు రకాల హోటల్స్లో చిన్న చిన్న ఫంక్షన్లకు, బర్తడే కు సైతం ఎక్కువగా వీటిని ఉపయోగిస్తూ ఉన్నారు. ఈ క్యాండిల్స్ ను పలు రకాల డిజైన్లలో తయారుచేసి కస్టమర్లను ఆకర్షించే విధంగా ఉండటం వల్ల మంచి లాభాలను అందుకోవచ్చు.

3). బెక్డ్ గూడ్స్:
కుకీస్ కప్ కేక్స్ వంటివి తయారు చేయడం వల్ల వీటికి ఏడాది మొత్తం డిమాండ్ ఉంటుంది. వీటితోపాటు చాక్లెట్లకు కూడా అంతే డిమాండ్ ఉంటుంది. మనం ఆన్లైన్లో ఆర్డర్ తీసుకొని లేకపోతే లోకల్ షాపుల ద్వారా స్టోర్లలో తీసుకొని బిజినెస్ గా చేసుకోవడం వల్ల మంచి లాభాలను పొందవచ్చు.

4). ఇంటి ప్లానింగ్:
ఎవరైనా ఇంటి ప్లానింగ్.. స్కెచ్ డిజైన్ వంటివి చేయించడానికి బాగా ఉపయోగపడుతుంది. సరికొత్త స్టైల్ మేకింగ్ తో హౌస్ ప్లానింగ్ చేయించినట్లయితే ఒక్కో ప్లానింగ్ కి దాదాపుగా రెండు నుంచి మూడు వేల రూపాయల వరకు సంపాదించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: