మనలో చాలామంది సంపాదించాలనే పట్టుదలతో ఉంటారు. అందుకోసం కొంతమంది అయితే డబ్బుని సేవింగ్ వంటివి చేస్తూ ఉంటారు.. వారికి వచ్చే ఆదాయం ఆధారంగా ఎంత పొదుపు చేయాలనే విషయాన్ని డిసైడ్ చేస్తూ ఉంటారు.చాలా మంది పిల్లల భవిష్యత్తు కోసం ఎక్కువగా పొదుపు చేస్తూ ఉంటారు. అయితే కేవలం కొన్ని పథకాలు కూడా ఇందుకోసం ఉన్నవి.. ఎక్కువగా బాలికల కోసమే పలు పథకాలను సైతం కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చింది. కానీ మగ పిల్లల కోసం కూడా ఎన్నో పథకాలు అందుబాటులో ఉన్నాయి. వాటి గురించి ఒకసారి చూద్దాం.


ఎలాంటి ఇబ్బందులు  లేకుండా మంచి రిటర్న్ వచ్చేటువంటి పథకాలలో పోస్ట్ ఆఫీస్ అగ్రస్థానంలో   ఉన్నది.. పోస్ట్ ఆఫీస్ మగ పిల్లల కోసం కొన్ని ప్రత్యేకమైన స్కీమును సైతం అందిస్తోందట. అలాంటి వాటిలో కిసాన్ పత్ర పథకం కూడా ఒకటి.. చాలా తక్కువ మొత్తంలో  పొదుపు చేయాలనుకునే వారికి ఈ స్కీమ్ మంచి ఆప్షన్ గా కూడా ఉపయోగపడుతుంది. ఈ పథకాన్ని 1988లో పోస్ట్ ఆఫీస్ ప్రవేశపెట్టింది. కేవలం మధ్యతరగతి కుటుంబాలకు మాత్రమే సరిపోయేలా ఈ స్కీమ్ ని తీసుకువచ్చారు.


తల్లితండ్రులు ఎవరైనా సరే ఒక నిర్దిష్ట మొత్తం పెట్టుబడిని ఇక్కడ పెట్టాలి..అయితే 18 ఏళ్లు నిండిన వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. కనీసం రూ 1000 నుంచి ఈ స్కీంలో పెట్టుబడి పెట్టవచ్చు.గరిష్టంగా ఎలాంటి లిమిట్ అనేది ఈ పథకంలో లేదట. మొత్తం మీద ఇందులో పెట్టుబడి పెట్టిన మొత్తానికి 7.9 శాతం వరకు వడ్డీ లభిస్తుందట ఒకవేళ అత్యవసర పరిస్థితులలో ఏదైనా ఉంటే కచ్చితంగా పెట్టిన పెట్టుబడి మొత్తాన్ని కూడా మనం తీసుకోవచ్చు. కిసాన్ పత్ర పథకం విషయానికి వస్తే 10 సంవత్సరాల 4 నెలల వరకు వీటి కాల వ్యవధి ఉంటుందట.ఈ స్కీం ద్వారా అతి తక్కువ వడ్డీ రేటుకి తల్లితండ్రులకు లోన్ కూడా అందించే అవకాశం ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: