ఈ వారం బిగ్ బాస్ 4 లో.. నామినేషన్ కారణాలు చెప్తున్నప్పుడు ‘ వేలెత్తి చూపించొద్దు’ అని అఖిల్ అన్నాడు. దానికి అభి కరెక్ట్ గా ఇచ్చి పడేశాడు. నువ్వు ఇన్నాళ్లూ ఇదే చేశావ్ గా అని అడిగాడు. దానికి అఖిల్ ‘నువ్వు మొన్న మోనల్ తో కూడా ఇలానే వేళ్ళు చూపించే మాట్లాడవ్’ అంటూ మోనాల్ ని మధ్య లోకి తెచ్చాడు. దీంతో అభి మళ్ళీ పర్ఫెక్ట్ కౌంటర్ ఇచ్చాడు. ‘ఆమె విషయం ఎందుకు ఈ చర్చలో. నేను ఆమెతో మాట్లాడుకుంటా’ అని అన్నాడు. దీంతో అఖిల్ కి నోటి మాట కరువైంది.