శుక్రవారం బిగ్‌బాస్ ఎపిసోడ్ చూశాక… ప్రేక్షకులు కూడా అదే మాట అంటున్నారు. ఎందుకంటే ఇంట్లో వినోదం అందిస్తారని అందరూ బిగ్‌బాస్ చూస్తుంటారు. నిన్నటి ఎపిసోడ్ చూస్తే ఎందుకు ఆ టాస్క్ పెట్టారో అర్థం కాలేదు. గాళ్స్ నైట్ అవుట్ పేరుతో శుక్రవారం రాత్రి బిగ్‌బాస్ ఇంట్లోని రిఫ్రెస్ ఏరియాలో ఓ పార్టీ పెట్టాడు. ఇంట్లో ఉన్న అమ్మాయిలు అందంగా ముస్తాబై అందులోకి వచ్చారు. చిప్స్ తింటూ, డ్రింక్స్ తాగుకుంటూ, డ్యాన్స్‌లు వేసుకుంటూ సరదాగా గడిపారు. అక్కడివరకు బాగుంది. ఆ తర్వాత ఇంట్లో ఉన్న అబ్బాయిల్ని పిలిచి ముచ్చట్లు పెట్టారు. వాళ్లతో ఏవేవే సరదా పనులు చేయించుకున్నారు. అభిజీత్‌తో అమ్మాయిలు చేసిన ఒపీనియన్ కాన్సెప్ట్ కాస్త బాగున్నా… మిగిలినవి సోసోగా సాగాయి. అయినా మంచి టాస్క్ ఇచ్చి ప్రేక్షకుల్ని అలరించకుండా ఈ పార్టీలు ఏంటో అర్థం కావడం లేదు. అమ్మ రాజశేఖర్, సోహైల్ కాసేపు నవ్వించినా… పెద్దగా వినోదం కనిపించలేదు. ఆఖర్లో అఖిల్ అయితే చిరాకు పుట్టించాడు.