బాస్ 4 లో ఈసారి బరువు ఎత్తు అనే కెప్టెన్సీ టాస్క్ లో హారిక గెలిచి కెప్టెన్ అయినట్లుగా సమాచారం అందుతుంది.హారికతో పాటుగా అఖిల్ ఇంకా అభిజిత్ కెప్టెన్సీ పోటీదారులుగా పోటీ ఇచ్చారు. వీళ్లముగ్గురూ పోటీ పడ్డారు. హారికని ఎత్తుకుని మోనాల్ చాలాసేపు ఉండటంతో హారిక ఈ టాస్క్ లో గెలిచింది. కొత్త కెప్టెన్ అయ్యింది. మొత్తానికి 11వారాల్లో మొదటి సారి కెప్టెన్ అయ్యింది హారిక. హారిక అమ్మ చెప్పినట్లుగానే ఈసారి గెలిచి ఆమె కోరికని తీర్చింది. ఈ టాస్క్ లో అఖిల్ ని సోహైల్, అలాగే అభిజిత్ ని అవినాష్ ఎత్తుకున్నారు. కానీ చివర వరకూ ఉండలేకపోయారట.