వరుస ఫ్లాప్ లతో సతమతమవుతన్న శ్రీనువైట్ల చాల గ్యాప్ తర్వాత తన కొత్త సినిమా ని అనౌన్స్ చేశాడు.. మంచు విష్ణు హీరో గా శ్రీనువైట్ల దర్శకత్వంలో ఢీ సినిమా కి కొనసాగింపుగా ఢీ & ఢీ అనే సినిమా ని ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే.. సరిగ్గా 13 సంవత్సరాలక్రితం వీరి కాంబో వచ్చిన ఢీ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.. మళ్ళీ ఈ సినిమా ని టచ్ చేయడం గొప్ప విశేషం అని చెప్పాలి..