సంక్రాంతి కి మాస్టర్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ ఆ సినిమా తో భారీ పరాజయాన్ని మూటకట్టుకున్నాడు. రిలీజ్ లేట్ అవడంతో సినిమా పై ఏర్పడ్డ బజ్ అంతా చల్లారిపోయింది.. దాంతో పండగ సీజన్ లో రిలీజ్ అయినా ఈ సినిమా మంచి పేరు తెచ్చుకోలేకపోయింది. తెలుగు లో నాలుగు సినిమాలతో పోటీ పడ్డ ఈ సినిమా తమిళ్లోనూ వారం తిరక్కముందే డల్ కలెక్షన్లతో ఢీలా పడిపోయింది. అక్కడ కూడా సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకోవడంతో విజయ్ ఫాన్స్ కొంత నిరాశలో ఉన్నట్లు తెలుస్తుంది..