అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ముద్దుగుమ్మ రాశిఖన్నా.ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల భామ ఆ తర్వాత వరుస విజయాలు అందుకుంటూ వస్తుంది. అందం పరంగానే కాదు ప్రతి సినిమాలో రాశీఖన్నా నటనకు ప్రశంశలు దక్కాయి.. అభినయం పరంగా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఆవగింజంత కూడా వంకబెట్టలేని అందంతో ఆమె కుర్ర ప్రేక్షకుల గుండె గోడలను కూల్చేసింది. వాళ్ల కలల కోటలో మెరుపులా మేను వాల్చేసింది. యంగ్ హీరోలతో పాటు స్టార్ హీరోలతో సినిమాలు చేసినా రాశి కి ఎందుకో స్టార్ హీరోయిన్ స్టేటస్ మాత్రం రాలేదు..