అరియనా.. బిగ్ బాస్ నాల్గో సీజన్ వరకు ఈమె యాంకర్ గా కొద్దీ మంది కే తెలుసు. కానీ ఎప్పుడైతే బిగ్ బాస్ లో పాల్గొని టాప్ 5 కి చేరుకుందో అప్పుడు ఆమెకు ఒక్కసారిగా ఫాలోయింగ్ పెరిగిపోయిందని చెప్పొచ్చు. అంతెందుకు అసలు అరియనా ఎవరు అన్నదానిపై ఎక్కువ గా సెర్చ్ చేస్తూ ఆమె చేసిన వీడియో లను తెగ చూస్తున్నారు అందరు. ఒక సాదా సీదా కంటెస్టెంట్ గా వచ్చి ఎందరో ఫేమస్ ఆర్టిస్టులను వెనక్కి నెట్టేసి ఆమె ఫైనల్ కి చేరుకోవడం అంటే ఆషామాషీ విషయం కాదు.