నటిగా పలు సినిమాల్లో నటించిన నటి సనాఖాన్ బిగ్ బాస్ లో పాల్గొని మంచి పాపులారిటీ దక్కించుకుంది.. హాట్ హాట్ ఫోట్లతో కుర్రకారును నిద్రలేకుండా చేసిన సనాఖాన్ ఇటీవలే వివాహం చేసుకుని వైవాహిక జీవితం గడుపుతున్న విషయం తెలిసిందే.. పరిశ్రమకు వీడ్కోలు పలికి గుజరాత్ కి చెందిన ఓ బిజినెస్ పర్సన్ ని వివాహం చేసుకున్న సనాఖాన్ తన వ్యక్తిగత జీవితంలో సంతోషంగా ఉంది. భర్త తో ఆనందంగా ఉన్న సమయంలో ఆమె గత విషయాలు ఇప్పుడు వైరల్ గా మారి తనను ఎంతో కలిచివేస్తున్నాయి. ఆమె గతంలో తన బాయ్ ఫ్రెండ్ తో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే.. పెళ్ళికిముందు ప్రముఖ కొరియో గ్రాఫర్ మెల్విన్ లూయిస్ తో ఆమె చెట్టాపట్టాలేసుకొని తిరిగింది.