టాలీవుడ్ ని చాల సంవత్సరాలుగా ఏలుతున్న కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత సినిమాలు చేయదనే అనుకున్నారు. కానీ ఆమె చిరంజీవి సరసన ఆచార్య సినిమాలో చేస్తున్న విషయం తెలిసిందే. పెళ్లి అయిన తర్వాత కొన్ని రోజులకే ఈ సినిమా కాజల్ చేస్తుండడంతో ఈ సినిమాలో ఏముందని అభిమానులు ఆసక్తిగా ఈ సినిమా గురించి ఎదురుచూస్తున్నారు. ఇటీవలే హనీమూన్ ని కంప్లీట్ చేసుకున్న కాజల్ త్వరలోనే షూటింగ్ లో పాల్గొననుంది.. ఇకపోతే ఈ సినిమా తప్పా ఆమె చేతిలో పెద్దగా సినిమాలు లేవు.