సారంగదారియా పాట వివాదం ఇంకా ముగిసిపోనట్లే కనిపిస్తుంది. ఇటీవలే శేఖర్ కమ్ముల ఈ వివాదానికి ముగింపు పలికేలా ఓ పోస్ట్ పెట్టినప్పటికినీ ఇంకా సోషల్ మిడియా లో దీనిపై సెటైర్లు పెరుగుతున్నాయి.. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా రాబోతున్న లవ్ స్టోరీ సినిమాలోని పాట కు ఇప్పటికీ మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ పాట ఒరిజినల్ సృష్టికర్త కోమలి తన అనుమతి లేకుండా పాటను ఉపయోగించిన సుద్దాల అశోక్ తేజ ను, డైరెక్టర్ శేఖర్ కమ్ములపై అలిగేషన్ చేసింది.. దాంతో నాలుగు రోజులు ఈ పాట పై పెద్ద వివాదం నడిచింది. పాట హిట్ అయ్యిందన్న ఆనందం కూడా చిత్ర యూనిట్ కి లేకుండా పోయింది..