ఏ పరిశ్రమ అయినా సక్సెస్ ఉంటేనే, పని ఉంటేనే పూట గడవడం కష్టం అవుతుంది.. అలాంటిది చేతిలో పని లేక ఉండే వారి ఆకలి బాధలు ఎవరికీ తెలియంది కాదు.. అలాంటి ఆకలి బాధలు సినిమా ఇండస్ట్రీలో ఇంకా ఎక్కువ అని చెప్పవచ్చు.. సక్సెస్ ను చూసి మళ్ళీ జీరో కి పడిపోయిన ఆర్టిస్టులు, దర్శకులు, నిర్మాతలు చాలామంది ఉన్నారు.. ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో టాప్ పొజీషన్ లో ఉన్న వారు ఇప్పుడు చేతిలో డబ్బులు లేకుండా జీవిస్తు ఆపసోపాలు పడుతున్నారు.. అలాంటి వారిలో నటి పావలా శ్యామల ఒకరు..