శృతిహాసన్ కి అవకాశాలు రావడం కష్టమే అనుకుంటున్న సమయంలో కరోనా ఫస్ట్ వేవ్ వచ్చింది.దానితో మన సినిమాల రాక కూడా మారిపోయింది. ఈ క్రమంలో శృతిహాసన్ కి రవితేజ క్రాక్ సినిమా తగిలింది.ఇక కట్ చేస్తే...ఆ సినిమా విడుదలై ఘన విజయం సాధించింది.ఇక క్రాక్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఆమె నటించిన వకీల్ సాబ్ సినిమా కూడా మంచి విజయన్ని అందుకుంది.అంటే కరోనా తర్వాత వరుసగా రెండు విజయాలు అందుకున్న ఏకైక హీరోయిన్ శ్రుతిహాసనే.