టాలీవుడ్ దిగ్గజధీరుడు డైరెక్టర్ రాజమౌళి, హీరో మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్న పాన్ వరల్డ్ చిత్రం వారణాసి. ఇందులో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా నటిస్తూ ఉండగా, మలయాళం స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ విలన్ గా కనిపించబోతున్నారు. ఈ యాక్షన్ అడ్వెంచర్ సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందని వినిపిస్తోంది.సుమారుగా రూ .1300 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. దీంతో ఈ సినిమా పైన అంచనాలు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి



గత ఏడాది టైటిల్ వీడియోను విడుదల చేయగా అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని రాజమౌళి స్వయంగా ప్రకటించారు. 2027 ఏప్రిల్ 7వ తేదీన ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్ పోస్టర్  విడుదలయ్యాక అభిమానుల ఒక కొత్త సందేహం మొదలయ్యింది. అది ఏమిటంటే రాజమౌళి వారణాసి సినిమాని రెండు భాగాలుగా తీస్తున్నారా అనే విధంగా వినిపిస్తున్నాయి. సినిమా టైటిల్ రిలీజ్ ఈవెంట్లో విడుదల చేసిన పోస్టర్లో వారణాసి సినిమా గ్లోబ్ ట్రాటర్ అండ్ టైమ్ ట్రాటర్ అనేటువంటి  ట్యాగ్స్ ని యాడ్ చేశారు.


కానీ తాజాగా విడుదల తేదీలో రిలీజ్ చేసిన పోస్టర్లో కేవలం గ్లోబ్ ట్రాటర్ అని మాత్రమే కనిపిస్తోంది. దీన్నిబట్టి చూస్తే వారణాసి మొదటి భాగం ప్రపంచాన్ని చుట్టేసి ఒక వీరుడు కథ , అలాగే వారణాసి 2లో కాలాల్ని చుట్టేసే ఒక ధీరుడు కథ అన్నట్లుగా టాక్ టాలీవుడ్ లో వినిపిస్తోంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే మాత్రం వారణాసి సినిమా తెలుగు ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులను సృష్టిస్తుందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి రెండు భాగాలుగా వస్తోందా? లేదా అనే విషయంపై మాత్రం రాజమౌళినే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.ఈ విషయం వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: