ఆలయానికి సంబంధించిన కొన్ని ఆచారాలు పూజల గురించి కూడా మీడియాలో వచ్చిన కథల ఆధారంగా ఈ విచారణ జరిపినట్లుగా సమాచారం. నటుడు జయరామ్ ఇంట్లో జరిగిన ఒక ఆధ్యాత్మిక పూజలో భాగంగా బంగారం పూత కలిగిన రాగి పలకలు ఉపయోగించారని అప్పట్లో వార్తలు వినిపించాయి. ఈ విషయాల గురించి సిట్ అధికారులు విచారించినట్లుగా సమాచారం. ఈ కేసులో కీలకమైన నిందితుడిగా ఉన్న ఉన్ని కృష్ణన్ పొట్టి తో పాటు జయరామ్ కు ఉన్నటువంటి పరిచయం కారణం చేత ఈ విచారణలో కీలకంగా మారినట్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కలిసి ఎప్పుడు పూజలు చేశారు? వీరిద్దరి మధ్య జరిగిన లావాదేవులు ఏంటి? అనే అంశాల పైన ప్రశ్నించారు.
2019లో చెన్నైలో జరిగిన ఒక ఆధ్యాత్మిక కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు బయటపడడంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయని అధికారులు చెబుతున్నారు. అయితే ఆ కార్యక్రమాన్ని ఉన్నికృష్ణన్ పొట్టి నిర్వహించారని, ముఖ్యంగా అక్కడ శబరిమల ఆలయం నుంచి తీసుకువచ్చిన కొన్ని బంగారం పూత వస్తువులను అక్కడ పూజా కార్యక్రమంలో ఉపయోగించారని అధికారులు భావిస్తున్నారు. ఇందులో రెండు ప్రధానమైన అంశాలు ఏమిటంటే ఒకటి ద్వారాపాలక విగ్రహం నుంచి బంగారం కొట్టేసారని, మరొకటి శ్రీకోవిల్ తలుపుల వద్ద ఉన్న బంగారం మాయమయ్యిందా? అనే అంశాల పైన విచారణ చేపడుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే 12 మందిని సైతం అరెస్టు చేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి