ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అందించింది. ప్రభుత్వ శాఖలలో ఉన్న ఖాళీలను సైతం భర్తీ చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈ మేరకు ఈ ఏడాది జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసే దిశగా కసరతులు చేస్తున్నట్లు సమాచారం. ఈ జాబ్ క్యాలెండర్ 2026 ఉగాదికి విడుదల చేసేలా నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి మంత్రి నారాలోకేష్ కూడా అధికారులకు పగడ్బందీగా సూచనలు ఇచ్చినట్లుగా సమాచారం. దీంతో అధికారులు కూడా శాఖల వారీగా భర్తీ చేయడానికి ఖాళీలను సేకరిస్తున్నట్లుగా తెలుస్తోంది.



ఈసారి జాబ్ క్యాలెండర్ లో పెద్ద సంఖ్యలోనే  ఉద్యోగాల భర్తీ ఉండబోతుందని అధికారులు తెలియజేస్తున్నారు. ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో పోస్టుల వివరాలు నమోదు చేస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం అన్ని శాఖలలో సుమారుగా 30% వరకు ఖాళీలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇందులో కొన్ని పోస్టులలో కాంట్రాక్టు ఉద్యోగులు పని చేస్తున్నారు. ఏపీపీఎస్సీ ద్వారా 20 నోటిఫికేషన్లు రాబోతున్నాయి. డీఎస్సీ ఉద్యోగాలు ఫిబ్రవరి నెలలో నోటిఫికేషన్ రావడానికి సిద్ధంగా ఉంది.




దాదాపుగా 99 వేల ఉద్యోగాలు డైరెక్ట్ రిక్రూమెంట్ ద్వారానే భర్తీ చేయబోతున్నట్లు సమాచారం. ఇవన్నీ పూర్తయిన తర్వాతే ఖాళీల లెక్క బయటపడుతుంది. అలాగే ఆర్థిక శాఖ వద్ద ఉన్నటువంటి వివరాల ప్రకారం రెవెన్యూ శాఖలో సుమారుగా 13,000 ఖాళీలు ఉన్నాయని, అదేవిధంగా విద్యాశాఖలో 7000 ఖాళీలు ఉన్నాయని, విద్యుత్ శాఖలో కూడా ఖాళీలు ఉన్నాయని, పురపాలక పట్టణ అభివృద్ధి శాఖలలో సుమారుగా 27,000 ఖాళీగా ఉండగా ఇందులో డైరెక్ట్గా 23 వేల వరకు నియామకాలు చేపట్టేలా ఉన్నాయట. వ్యవసాయ శాఖలో 3 వేల పోస్టులు, పంచాయతీరాజ్ శాఖలో కూడా ఖాళీలు అధికంగానే ఉన్నాయని చెబుతున్నారు. అలాగే పోలీస్ శాఖలో కూడా 11 వేలకు పైగా ఖాళీలు ఉన్నాయని వినిపిస్తున్నాయి. ఖాళీల పైన అధికారికంగా స్పష్టత వచ్చిన తర్వాతే ప్రభుత్వం కూడా ఉద్యోగుల క్యాలెండర్ ని విడుదల చేయబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: