సుదేవ్ నాయర్ కు సరైన బ్రేక్ ఇచ్చిన చిత్రం పవన్ కళ్యాణ్ నటించిన ఓజి సినిమాని అని చెప్పవచ్చు. ఈ చిత్రంలో విలన్ కొడుకుగా చాలా స్టైలిష్ గా కనిపిస్తారు. ఇటీవల చిరంజీవి నటించిన మన శంకరవరప్రసాద్ గారు చిత్రంలో కూడా విలన్ గానే కనిపించారు. సుదేవ్ నాయర్ రెగ్యులర్ చిత్రాలలో కూడా చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. దీంతో స్టార్ హీరోలకు లక్కీ విలన్ గా మారిపోయిన సుదేవ్ నాయర్ మన శంకర వరప్రసాద్ సినిమా తర్వాత వరుస అవకాశాలు అందుకుంటున్నారు.
సుదేవ్ నాయర్ కేవలం నటుడు మాత్రమే కాదట, క్రీడాకారుడిగా కూడా ఆయన మార్షల్ ఆర్ట్స్ లో మంచి ప్రాధాన్యత ఉన్నది. ఆయన చేసే యాక్షన్ సీన్స్ లలో కూడా వాటిని ఉపయోగించుకుంటున్నారు. సుదేవ్ నాయర్ ది అథ్లెటిక్ బాడీ కావడంతో విలన్ పాత్రలో చాలా సరికొత్త టచ్ తో కనిపిస్తున్నారు. కన్నడ నటుడు అయినప్పటికీ ప్రస్తుతం అన్ని భాషలలో ఫుల్ డిమాండ్ ఉన్న నటుడుగా పేరు సంపాదించారు. హీరో యష్ నటిస్తున్న టాక్సిక్ చిత్రంలో కూడా విలన్ గా కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా ఈ ఏడాది ప్రేక్షకులందరికీ రాబోతోంది. ఒకవేళ ఈ సినిమా సక్సెస్ అయితే సుదేవ్ నాయర్ క్రేజ్ మరోలా ఉంటుందని చెప్పవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి