నందమూరి అక్కినేని కుటుంబ హీరోల మధ్య సినిమాల వార్ కొన్ని దశాబ్దాల నుంచి జరుగుతూనే ఉంది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా వీరి సినిమాల మధ్య వార్ కొంతవరకు తగ్గినా నాగార్జున బాలకృష్ణల మధ్య గ్యాప్ రోజురోజుకు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం అక్కినేని కుటుంబ సభ్యులతో ముఖ్యంగా నాగార్జునతో మంచి సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూనే  ఉన్నాడు. అయితే అటువంటి జూనియర్ కి నాగచైతన్య నుండి అనుకోని షాక్ తగలబోతు ఉండటం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. 

జూనియర్ ఎన్నో భారీ అంచనాలతో నటిస్తున్న ‘జనతా గ్యారేజ్’ సినిమాను ఆగష్టులో ఎటువంటి పోటీ లేకుండా సోలోగా వచ్చి టాలీవుడ్  కలెక్షన్స్ షేక్ చేద్దామని అనుకుంటూ ఉంటే నాగ చైతన్య ఊహించని షాక్ ఇవ్వ బోతున్నాడు అని టాక్. ఎన్టీఆర్ ఎంతో ఆలోచించి ఏ హీరో సినిమాతోను పోటీ లేకుండా ఆగస్టు నెలలో బాక్సాఫీసు దగ్గర సందడి ఎక్కువగా ఉండదు కాబట్టి తన ‘జనతా గ్యారేజ్’ కి అన్నివిధాలా అనుకూలంగా ఆగస్టు 12వ తేదీన తన సినిమా విడుదల అని ఎప్పుడో ప్రకటించాడు. అందుకు తగ్గట్టుగానే ఈసినిమా  షూటింగ్ శరవేగంగా సాగుతోంది. 

అయితే ఇంతలో ఎన్టీఆర్ ని ఢీ కొట్టడానికి నాగచైతన్య రంగంలోకి దిగడం ఆశ్చర్యమే కాకుండా జూనియర్ కు కుడా అర్ధం కాని పజిల్ లా మారింది అని టాక్. ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం చైతూ నటిస్తున్న ‘ప్రేమమ్’ ని కూడ ఆగస్టు 12న విడుదల చేయాలని చిత్రబృందం డిసైడయినట్టు సమాచారం. ‘ప్రేమమ్’ సమ్మర్ కే వస్తుందని ఊహించారంతా. కానీ చిత్రీకరణలో జాప్యం వల్ల  విడుదల వానా కాలానికి మారింది.  అయితే ఇప్పుడు అటు ఇటు తిరిగి ఎన్టీఆర్ సినిమా విడుదలయ్యే తేదీనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 

మాస్ కంటెంట్ తో వస్తున్న ‘జనతా గ్యారేజ్’ ని ఫీల్ గుడ్ ప్రేమమ్ ఎంత వరకు తట్టుకొని నిలబడుతుందన్నది ఇప్పుడు ఎవ్వరికీ అర్ధం కాని ప్రశ్న గా మారింది. అయితే ‘ప్రేమమ్’ యూనిట్ మాత్రం మంచి కాన్ఫిడెన్స్ తో  ఉన్నట్లు కనిపిస్తోంది అంటూ వార్తలు వస్తున్నాయి. దీనితో  ప్రేక్షకులు ఆగష్టులో స్వాతంత్రదినోత్సవ సందర్భంగా ఒక క్లాస్ సినిమాతో మరొక  మాస్ సినిమాను ఎంజాయ్ చేయబోతున్నారా అంటూ కామెంట్స్ వస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: