అల్లు శిరీష్ తన ఫేస్ లుక్ మార్చుకోవడానికి ‘కాస్మో సర్జరీ’ చేయించుకున్నాడు అంటూ కొందరు చేస్తున్న ప్రచారం చాలామందికి షాక్ ఇచ్చింది. అయితే ఈ గాసిప్పులు ఇలా హడావిడి చేయడానికి కారణం ఉంది అని అంటున్నారు. అల్లుశిరీష్ లేటెస్ట్ గా నటిస్తున్న ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమాకు సంబంధించి లేటెస్ట్ గా విడుదలైన శిరీష్ లుక్ కు సంబంధించిన ఫోటోలు ఇలాంటి సందేహాలను కలిగిస్తున్నాయి అని టాక్.

ఇప్పటి వరకు అల్లు శిరీష్ రెండు సినిమాలలో నటించినా అతడి యాక్టింగ్ స్టిల్స్ కు కనీసం మెగా అభిమానులు కూడ పాస్ మార్కులు కూడ వేయలేకపోయారు. అంతేకాదు కనీసం నటన రాకపోయినా శిరీష్ తన లుక్ అయినా మార్చుకోవచ్చు కదా అంటూ శిరీష్ పై సోషల్ మీడియాలో సెటైర్లు కూడ వేసారు.

ఈ కామెంట్స్ శిరీష్ పై బాగా ప్రభావితం చేసినట్లు ఉన్నాయి. దీనితో కొన్ని నెలల క్రితం శిరీష్ ముంబాయి వెళ్ళి తన లుక్ మార్చు కోవడానికి సంబంధించి అనుభవజ్ఞులు దగ్గర కొన్ని సలహాలు తీసుకుని ఈ లుక్ లోకి మారిపోయాడు అని శిరీష్ సన్నిహితులు చెపుతూ ఉంటే మరికొందరు మాత్రం శిరీష్ ముంబాయిలో కాస్మో సర్జరీ చేయించుకున్నాడు అంటూ వార్తలు ప్రచారం చేస్తున్నారు.

గతంలో అల్లు అర్జున్  తన ఫేస్ లుక్ మార్చుకోవడం కోసం ఇలాంటి కాస్మో సర్జరీ చేయించుకున్నాడు అన్న వార్తలు వచ్చాయి. బన్నీ నటించిన ‘గంగోత్రి’ సినిమాలో అతడి లుక్ పై ఇటువంటి నెగిటివ్ కామెంట్స్ వచ్చిన నేపధ్యంలో బన్నీ తన లుక్ ను మార్చుకుని స్టైలిష్ స్టార్ గా మారిపోయాడు. ఇప్పుడు శిరీష్ కూడ తన అన్నను అనుసరిస్తూ ఇలాంటి సర్జరీలు చేయించుకున్నాడా ? అన్న అనుమానంతో కొందరు ఇటువంటి రూమర్స్ ను శిరీష్ పై ప్రచారం చేస్తున్నారు అని అనుకోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: