తమిళంలో విజయవంతమైన ‘నాన్’ సినిమాను తెలుగులో ‘నకిలీ’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ నెల 9న విడుదల అవుతున్న ఈ చిత్రంలో విజయ్ అంటోని హీరోగా నటించడం విశేషం. రూపా మంజరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు జీవశంకర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను తెలుగులో ఎం.రాజశేఖర్, చినబాబు అరిగెల విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘మెడికల్ కాలేజ్ నేపథ్యంలో సాగే కథ ఇది. ఒక యువకుడు తనకు తెలియకుండా చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి మళ్లీ మళ్లీ ఎలాంటి తప్పులు చేశాడన్నదే’ చిత్రకథ అని తెలిపారు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుందని చెప్పారు. ఈ సినిమాకు విజయ ఆంటోని సంగీతం అందించడం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి: