అందాల నటుడు శోభన్ బాబు క్రమశిక్షణకు పెట్టింది పేరు. సినిమాల్లోకి ప్రవేశించిన కొత్తలో ఆయనకు ‘చదువుకున్న అమ్మాయిలు’ సినిమాలో అవకాశం వచ్చింది. ఈ సినిమాలో ఒక సన్నివేశంలో సావిత్రిని చెంప దెబ్బ కొట్టవలసి వచ్చింది. శోభన్ బాబుకు సావిత్రి అభిమాన నటి. పైగా అప్పటికి సావిత్రి తిరుగులేని నటి. దీంతో ఈ సన్నివేశం చేయడానికి శోభన్ బాబు ఎంతో కంగారు పడిపోయారు. చివరికి ఏదో విధంగా సన్నివేశం ముగించి, సావిత్రికి సారీ చెప్పారు శోభన్ బాబు.
మరింత సమాచారం తెలుసుకోండి: