తెలుగు సినిమా అభిమానుల డార్లింగ్ ప్రభాస్ ‘బాహుబలి 2’ నేషనల్ స్టార్ గా మారిపోయాడు. లోకల్ సిటీకేబుల్ నుండి ఇంటర్ నేషనల్ ఐబిఎన్ ఛానల్ వరకు ఎక్కడ చూసినా ‘బాహుబలి 2’ వార్తల సంచలనాలే కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థుతులలో ప్రభాస్ ‘బాహుబలి 2’ రిలీజ్ తరువాత ఈ సినిమాకు సంబంధించిన కొన్ని భారీ పోస్ట్ ప్రమోషన్ ఈ వెంట్స్ ను తప్పించుకోవడం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది.

దాదాపు 5 సంవత్సరాలు పైగా ‘బాహుబలి’ ప్రాజెక్ట్ కోసం ప్రభాస్ అన్నీ త్యాగం చేసుకున్న నేపధ్యంలో ప్రస్తుతం ‘బాహుబలి 2’ సక్సస్ ను ఆనందిస్తూ ప్రభాస్ ప్రస్తుతం అమెరికాలో తన సన్నిహితులతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ నేపధ్యంలో తనను నేషనల్ హీరోను చేసిన రాజమౌళి ఎంత బలవంత పెట్టినా లండన్ లో జరిగిన ‘బాహుబలి 2’ ప్రత్యేక ప్రదర్శనకు ప్రభాస్ అమెరికా నుండి లండన్ వెళ్ళలేదు. 

ఇదే సందర్భంలో ‘బాహుబలి 2’ ఘన విజయానికి కీలక పాత్ర వహించిన కరణ్ జోహార్ ముంబాయిలో ఏర్పాటు చేయబోతున్న ఒక భారీ పార్టీకి కూడ ప్రభాస్ రావడం లేదు అన్న వార్తలు వస్తున్నాయి. అత్యంత భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్న ఈ పార్టీకి ‘బాహుబలి’ టీమ్ అందరితో పాటు ప్రముఖ బాలీవుడ్ నటీనటులు బాలీవుడ్ మీడియా ప్రముఖులు ఈ పార్టీకి హాజరు కాబోతున్నారు.

ప్రస్తుతం అమెరికాలో ఉన్న ప్రభాస్ ను తన ఆనందానికి రెండు రోజులు బ్రేక్ ఇచ్చి ప్రత్యేకంగా ఈ పార్టీకి రమ్మని కరణ్ జోహార్ ప్రభాస్ పై ఎంత ఒత్తిడి చేసినా ప్రభాస్ సున్నితంగా తిరస్కరిస్తున్నట్లు తెలుస్తోంది. పోనీ ప్రభాస్ అమెరికా నుండి తిరిగి వచ్చిన తరువాత ప్రభాస్ కు వీలైన డేట్ కు ఈ పార్టీని నిర్వహిస్తాను అని కరణ్ జోహార్ చెప్పినా తనకు పార్టీల పట్ల పెద్దగ ఇష్టం లేదని ప్రభాస్ సున్నితంగా సమాధానం ఇచ్చి ఈ పార్టీని తప్పించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

దీనితో ప్రభాస్ కు ఏమైంది అంటూ బాలీవుడ్ మీడియా వార్తలు వ్రాస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ మీడియాలో కీలక వ్యక్తిగా ఎదిగి పోయిన ప్రభాస్ వార్తలకు విపరీతమైన ప్రాధాన్యత లభిస్తోంది. ఇలాంటి పరిస్థుతులలో కేవలం అమెరికా టూర్ వంక పెట్టి ప్రభాస్ అటు రాజమౌళి ఇటు కరణ్ జోహార్ ఒత్తిడులను ఎందుకు తిరస్కరిస్తున్నాడు అన్న విషయం సమాధానం లేని ప్రశ్నగా బాలీవుడ్ మీడియాకు మారింది..  


మరింత సమాచారం తెలుసుకోండి: