తెలుగునాట నటదిగ్గజాలు ఎన్ టి అర్, ఏ ఎన్ అర్, తరవాత ఆ రెండు స్థానాలని కైవశం చేసుకుని "నటత్రిగ్గజం" లలో ఒకటై పోయారు నటరత్నం చిరంజీవి. మెగా హీరోగా తెలుగువారి చేత ముచ్చటగా పిలిపించుకుంటున్న నాలుగు దశాబ్ధాలుగా ఏకచ్చత్రాధిపత్యం వహిస్తూ నటిస్తున్న నటుడూ ఆయనే. దాదాపు ఒక దశాబ్ధకాలం రాజకీయ రంగం లో మునిగి తేలి వచ్చినా తన స్థానం తనకే తప్ప వేరొకరు తీసుకోలేరు అన్నంత భరోసా ను ఋజువు చేసిందీ ఆయనే.

అయితే మెగాస్టార్ చిరంజీవి స్టామినా ఎలా ఉంటుందో ఏంటో మరోసారి టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు తెలిసేలా చేసింది, ప్రస్తుతం ఆయన నటిస్తున్న ప్రతిష్ఠాత్మక "సైరా నరసింహారెడ్డి" చిత్రం. ధృవ తో సూపర్ దర్శకుడు అనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగా తనయుడు రామ్ చరణ్ నిర్మాతగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న "సైరా నరసింహారెడ్డి" మూవీ "డిజిటల్ రైట్స్" ని "అమెజాన్ ప్రైమ్" సంస్థ ఏకంగా ₹30 కోట్లతో టోటల్ ఇండియా రైట్స్ ని సొంతం చేసు కుందని వార్తలొచాయి.
"ఫస్ట్ లుక్ టు ట్రైలర్" వరకు ప్లస్ మేకింగ్ వీడియోల పై సర్వ హక్కులు దక్కించుకున్న "అమెజాన్ ప్రైమ్" ఇంత అట్రాక్టివ్ అమౌంట్ ఇచ్చి ఓ సినిమాను డిజిటల్ రైట్స్ కొనడం ఇదే మొదటిసారి.
భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలుకూడా అంబరాన్ని తాకాయి. మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్‌కి రెడీ అవుతున్న తరుణములోనే ఇంత బిజినెస్ జరగటం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
అయితే చిత్రీకరణ ఇంకా జరుగుతుండగానే ఇటువంటి గ్రేట్ ఆఫర్ రావడంతో సోషల్ మీడియా అంతా చిరు స్టామినా అన్ టే ఇదంటూ ఈ వార్త ట్రెండింగ్ చేస్తుండటం విశేషం. "మెగాస్టారా! మజాకా! చిరంజీవికే ఆ సత్తా ఉంది, ఆయనే సాధించలేని దాన్ని కూడా ఆధించగలరని వన్ & ఓన్లీ చిరంజీవి" అంటూ సోషల్ మీడియాలోఆయన అభిమానులు కోళ్ళై కూస్తున్నారు. ఇంకేం చిరుభ్యోన్నమః అంటూ జపం చేస్తూ నింగీ నేలను కలిపేస్తున్నారు.
