సంక్రాంతి రేసులో ఊహించని బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘ఎఫ్ 2’ కలక్షన్స్ విషయంలో దూసుకుపోతూ ఉండటంతో ఈమూవీ 50 కోట్ల కలక్షన్స్ మార్క్ ను అందుకున్నా ఆశ్చర్యం లేదు అంటున్నారు. అదే నిజం అయితే వెంకటేష్ కెరియర్ లో అత్యధిక కలక్షన్స్ ను రాబట్టిన మూవీగా ‘ఎఫ్ 2’ రికార్డ్ ను క్రియేట్ చేయబోతోంది. 
హనీ ఈజ్ ది బెస్ట్... మేనరిజం నేను క్రియేట్ చేసింది కాదు
ఈమూవీలో వరుణ్ తేజ్ పక్కన హీరోయిన్ గా నటించిన మెహ్రీన్ కు యూత్ బాగా కనెక్ట్ అవుతున్నారు. ఈసినిమాలో ఆమె చెప్పిన ‘హానీ ఈజ్ ద బెస్ట్’ డైలాగ్ ఇప్పుడు బాగా పాపులర్ అయింది. వాస్తవానికి ఈసినిమాలో ఈ డైలాగ్ ను దర్శకుడు అనిల్ రావిపూడి క్రియేట్ చేయడం వెనుక ఒక చిన్నారి ప్రభావం ఉందట. ఈమూవీని ప్రమోట్ చేస్తూ ఈవిషయాన్ని స్వయంగా అనిల్ రావిపూడి వివరించాడు.  
బికినీ సీన్లు అదరగొట్టారు
‘ఎఫ్ 2’  లో మెహ్రీన్ మ్యానేరిజమ్ కు సంబంధించిన విషయాలను తాను గతంలో తీసిన ‘రాజా ది గ్రేట్’ సినిమాలో నటించిన ఒక చైల్డ్ ఆర్టిస్ట్ నుండి కాపీ చేసిన విషయాన్ని బయటపెట్టాడు అనీల్ రావిపూడి. ‘రాజా ది గ్రేట్’ సెకండ్ హాఫ్ లో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ పేరు హనీ అని చెపుతూ షూటింగ్ స్పాట్ లో ఉదయమే రవితేజా కన్నా ముందు వచ్చి కూర్చుని ఉన్న హనీని తాను ‘గుడ్ మార్నింగ్’ అని చెప్పగానే చైల్డ్ ఆర్టిస్ట్ హనీ ‘హానీ ఈజ్ ద బెస్ట్’ అంటూ క్యూట్ గా చెప్పడమే కాకుండా ఒక డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ ని కనపరిచినప్పుడు ఆ బాడీ లాంగ్వేజ్ ని యథా తధంగా తాను మెహ్రీన్ కు చెప్పి ఆమె చేత నటింప చేసిన విషయాలను వివరించాడు. 
అదే... హనీ ఈజ్ ది బెస్ట్
ఇప్పుడు ఈసినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఈమూవీకి సంబంధించి జరగబోయే సక్సస్ మీట్ లో ఆ చైల్డ్ ఆర్టిస్ట్ హనీని పిలిచి ఆ చిన్నారిని తాను సత్కరించబోతున్న విషయాన్ని అనీల్ రావిపూడి బయటపెట్టాడు. ప్రస్తుతం వరస సక్సస్ లతో దూసుకు పోతున్న అనీల్ రావిపూడి పట్ల మహేష్ బాలకృష్ణలు కూడ ఆసక్తి కనపరుస్తున్నారు అంటే ఇప్పుడు ఈ దర్శకుడు హవా ఏరేంజ్ లో కొనసాగుతోందో అర్ధం అవుతోంది..   


మరింత సమాచారం తెలుసుకోండి: