‘ఇస్మార్ట్ శంకర్’ ఘన విజయం తరువాత రెండు నెలల పాటు విహార యాత్రకు వెళ్ళి పోతాను అని చెప్పిన పూరి తన మనసును మార్చుకుని ఇప్పుడు కొన్ని కథలకు సంబంధించిన లైన్స్ పట్టుకుని హీరోలు అందరిచుట్టూ తిరుగుతున్నాడు. ఈ నేపధ్యంలో బాలకృష్ణ దగ్గర నుండి విజయ్ దేవరకొండవరకు ఇలా రకరకాల హీరోలను తన మాటల మాయలో పడేయడానికి పూరి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు.

ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం పూరి ఈమధ్య విజయ్ దేవరకొండను కలిసి ఒక లైన్ చెప్పినట్లు సమాచారం. ఈ స్టోరీ లైన్ కు సంబంధించి బయటకు వస్తున్న వార్తల ప్రకారం ఈ కథలో హీరోకు నత్తి ఉంటుందని టాక్. అయితే ఆ నత్తితో చెప్పే డైలాగ్స్ చివరిన చిన్న ఫన్ ఉంటుందని అంటున్నారు.

ఈ స్టోరీ లైన్ విజయ్ దేవరకొండకు బాగా నచ్చడంతో ఆకథను డెవలప్ చేయమని పూరీకి చెప్పినట్లు తెలుస్తోంది. దీనితో ప్రస్తుతం పూరి ఈ పనుల పై బిజీగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘రంగస్థలం’ కథలో రామ్ చరణ్ చెవిటి వాడుగా సక్సస్ అయ్యాడు కాబట్టి విజయ్ దేవరకొండను నత్తి ఉన్న హీరోగా చూపించే విషయంలో పూరీ ఎలా తెలివిగా వ్యవహరిస్తాడో చూడాలి. . అయితే పూరీ కష్టపడి ఫైనల్ స్క్రిప్ట్ తయారు చేసిన తరువాత ఆ కథ విజయ్ కి నచ్చకపోతే మళ్ళీ కథ ముందుకు వచ్చే ఆస్కారం ఉంది.   

ఇలాంటి పరిస్థితులలో సూపర్ హిట్ కొట్టినా పూరీని పూర్తిగా నమ్మలేకపోతున్న టాప్ హీరోల ప్రవర్తన పూరీకి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నట్లు టాక్. ఈ నేపధ్యంలో పూరీ చెపుతున్న కథలకు ముందుగా బాలకృష్ణ బుట్టలో పడతాడా లేదంటే విజయ్ దేవరకొండ లైన్ లోకి వస్తాడా అన్న విషయం తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: