మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చే సంవత్సరం జనవరి 1 నుండి ప్రారంభం కాబోతున్న సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం  తెలిసిందే. కుటంబ కధా చిత్రాలకు చిరునామాగా ఉన్న శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాను కూడా గోదావరి నేపధ్యంలో, గోదావరి యాస తో భీమవరం చుట్టుపక్కలా చిత్రీకరిస్తాడట. అయితే సినిమాకు సంబంధించి ఒక విచిత్రమైన సెంటిమెంట్ కూడా వినపడుతోంది. సామాన్యంగా మెగా కుటంబంలో ఏ హీరో మొదటిసారిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా ఆ కధను వినడమే కాకుండా మార్పులు చేర్పులు చేయడం చిరంజీవికి అలవాటట. గతంలో పవన్, అల్లుఅర్జున్, రామ్ చరణ్ సినిమాల వ్యవహారాలను చిరంజీవి దగ్గర ఉండి చూసుకునే వాడట.  అయితే ప్రస్తుతం ఆ సెంటిమెంట్ కొనసాగించడానికి రాష్ట్ర రాజకీయాలతో పాటుగా దగ్గర పడుతున్న ఎన్నికల రీత్యా ఈ బాధ్యతను తన చిరంజీవి తరఫున పవన్ తలకు ఎత్తుకున్నాడని వార్తలు వస్తున్నాయి. వరుణ్ తేజ్ నటిస్తున్న సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చెప్పడం దగ్గర నుంచి వరుణ్ తేజ్ ఎటువంటి కాస్ట్యూమ్స్ వేసుకోవాలో వరుణ్ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలో అనే విషయాలు పవన్ దగ్గర ఉండి చూసుకుంటున్నాడు అనే వార్తలు వినపడుతున్నాయి. పవన్ తన ‘గబ్బర్ సింగ్ 2 స్క్రిప్ట్ విషయంలో బిజీగా ఉండి కూడా చిరంజీవికి ఇచ్చిన మాట కోసం వరుణ్ తేజ్ సినిమాపై అంత శ్రద్ద పెట్టడాన్ని బట్టి వరుణ్ తేజ్ సినిమా చిరు పవన్ లను కలిపే వారధిగా మారనుంది అనే మాటలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: