పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదని ఓ సామెత. అంటే ఎంత టాలెంట్ ఉన్నా..అది సొంతవారికి ఉపయోగపడకపోవడం అన్నమాట.. ఈ సామెత టాప్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ విషయంలో చాలా బాగా సూట్ అవుతుంది. ఎందుకంటే.. ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ఈ టాలీవుడ్ డైరెక్టర్ సొంత తమ్ముడు, కొడుకుకు మాత్రం ఇప్పటి వరకూ హిట్ ఇవ్వలేకపోయాడు.


ఇప్పుడు ఆ కసితోనే పూరి జగన్నాథ్ మరో ప్రయత్నం చేస్తున్నారు. ఆకాష్ కు ఎలాగైనా హిట్ ఇవ్వాలన్న కసితో రూపొందిస్తున్న సినిమా ఇది. నూతన దర్శకుడు అనిల్ పాదూరి దర్శకత్వంలో వస్తోందీ సినిమా. ఈ సినిమాలో ఆకాశ్ పూరి సరసన కేతికా శ‌ర్మ హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ బాగా వైరల్ అయ్యింది.


ఇక ఇప్పుడు ఈ సినిమాలో సీనియర్ నటి రమ్యకృష్ణ ఓ కీ రోల్‌ లో నటిస్తున్నారన్న వార్త సంచలనం సృష్టిస్తోంది. రమ్యకృష్ణ ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈరోజు నుంచి ఆమె షూటింగ్ లో పాల్గొంటున్నారట. రమ్యకృష్ణ ఎంట్రీతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్ కలకలం రేపింది. హీరోయిన్ కేతికా శర్మ టాప్ లెస్ పోజులు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయ్యియి. హీరోయిన్ కేతిక టాప్ లెస్ గా హీరోని కౌగిలించుకోవడం.. ఘాటు ప్రేమలో ప్రపంచాన్ని మర్చిపోయిన ప్రేమ జంటగా వీరిద్దరూ కనిపించడం యూత్ ను బాగా ఎట్రాక్ట్ చేసింది.


ఈ సినిమా మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇస్మార్ట్ శంకర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పూరీ, ఛార్మి సంయుక్త నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా ఇప్పుడు రమ్యకృష్ణ ఎంట్రీతో మరింత ఇంట్రస్టింగ్ గా మారింది. మరి ఈ సినిమాతోనైనా పూరీ జగన్నాథ్ తన కొడుకుకు హిట్ బహుమతిగా ఇస్తాడా లేదా అన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: