-
A R Murugadoss
-
Ala Vaikuntapuramlo
-
Ala Vaikunthapurramloo
-
ala venkatapuram lo
-
Allu Arjun
-
Bobby
-
Cinema
-
Darbar
-
Darsakudu
-
Director
-
Entha Manchivaadavuraa
-
Gabbar Singh
-
January
-
Makar Sakranti
-
murugadoss
-
Naga Chaitanya
-
nandamuri taraka rama rao
-
NTR
-
Payal Rajput
-
raashi khanna
-
Rashi Khanna
-
sankranthi
-
Sankranti
-
Tollywood
-
Venkatesh
-
Venky Mama
-
Yuva
యువ దర్శకుడు బాబీ దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమా వెంకీ మామ. విక్టరీ వెంకటేష్ మరియు నాగచైతన్య హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో వెంకీకి జోడిగా పాయల్ రాజ్ పుత్ నటిస్తుంటే, చైతుకు జోడిగా రాశి ఖన్నా నటిస్తోంది. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. వెంకటేష్ ఈ సినిమాలో రైతుగా నటిస్తుంటే, నాగ చైతన్య సైనికుడిగా నటిస్తున్నట్లు సమాచారం. పల్లెటూరి నేపథ్యంలో కుటుంబంలోని బంధాలు అనుబంధాలను పెన వేస్తూ, ఆద్యంతం మంచి ఎంటర్టైనింగ్ గా సాగే విధంగా దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. రవితేజ హీరోగా వచ్చిన పవర్ అనే సినిమాతో టాలీవుడ్ కి దర్శకుడిగా పరిచయం అయిన బాబీ, తొలి సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడం జరిగింది.
ఆ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఆయన తెరకెక్కించిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ, అనంతరం ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కించిన జైలవకుశ సినిమా మాత్రం మంచి విజయాన్ని నమోదు చేసింది. ఇక ప్రస్తుతం తెరక్కిస్తున్న వెంకీ మామ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని భావించారు. అయితే సినిమా రిలీజ్ తేదీ విషయమై ప్రస్తుతం దర్శక నిర్మాతలు కొంత సంకోచిస్తునట్లు టాలీవుడ్ వర్గాల టాక్. అసలు మ్యాటర్ ఏంటంటే, మహేష్ నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు,
అలానే బన్నీ హీరోగా తెరకెక్కుతున్న అల వైకుంఠపురములో సినిమాలు ఇప్పటికే సంక్రాంతి బరిలో నిలిచి జనవరి 12న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. అలానే కళ్యాణ్ రామ్ హీరోగా సతీష్ వేగేశ్న తీస్తున్న ఎంత మంచివాడవురా సినిమా కూడా సంక్రాంతి బరిలో నిలిచింది, మరోవైపు రజినికాంత్ మరియు మురుగదాస్ ల కలయికలో రాబోతున్న దర్బార్ సినిమా కూడా అదే రేస్ లో నిలవడంతో, తమ సినిమాను సంక్రాంతి తరువాత కొద్దిరోజులకు రిలీజ్ చేస్తే బాగుంటుందని ఆ సినిమా యూనిట్ యోచిస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై వారి నుండి అధికారిక ప్రకటన మాత్రం వెలువడవలసి ఉంది....!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి