టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా 'అల వైకుంఠపురములో' కు సంబంధించి ఇప్పటివరకు రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్, సామజవరగమనా పల్లవితో సాగె ఒక లిరికల్ సాంగ్ యూట్యూబ్ లో బాగా సక్సెస్ సాధించడంతో పాటు ప్రేక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టడం జరిగింది. బన్నీ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా పీఎస్ వినోద్ ఫోటోగ్రఫీని, ఎస్ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
ఇకపోతే ఈ సినిమా నుండి రాములో రాముల అనే పల్లవితో సాగె ఒక సాంగ్ వీడియో ప్రోమోని మూడు రోజల క్రితం యూట్యూబ్ లో రిలీజ్ చేసింది సినిమా యూనిట్. మంచి పార్టీ మూడ్ లో క్లాస్ టచ్ తో సాగిన ఈ సాంగ్ ప్రోమోకు ప్రస్తుతం వీక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రస్తుతం ఈ సాంగ్ ప్రోమో 5 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కించుకుని దూసుకుపోతోంది. అనురాగ్ కులకర్ణి మరియు మంగ్లీ కలసి ఆలపించిన ఈ సాంగ్ ని కాసర్ల శ్యామ్ రచించడం జరిగింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి